సవతితల్లి పాత్రలో...

అలనాటి అందాల నటి శ్రీదేవి కొంతకాలం క్రితం ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో మళ్ళీ తెరపైకొచ్చి మంచి మార్కులే కొట్టేసారు. ఆ సినిమా తెలుగు, తమిళం భాషలలో బాగానే ఆడింది. ఇప్పుడు ఆమె తన భర్త బోనీ కపూర్ తీయబోయే మరో హిందీ సినిమాలో నటించబోతున్నారు. సవతితల్లి, కూతురు మధ్య సాగే ఈ చిత్ర కథలో శ్రీదేవి పాత్ర చాలా ప్రధానమైనదని బోనీ కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఒక తమిళ చిత్రంలో విజయ్, కన్నడం సూపర్ స్టార్ సుదీప్ తో కలిసినటిస్తున్నారు. ఆది పూర్తవడంతోనే శ్రీదేవి ముంబై చేరుకున్న తర్వాత  బోనీ కపూర్ చిత్రంలో నటిస్తారు. ఈ చిత్రంలో ఆమె నిజ జీవితంలోని కొన్ని అనుభవాలు కూడా కథలో భాగం కానున్నాయని తెలిసింది. దాదాపు పదిహేనేళ్ళ పాటు చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్న తర్వాత తిరిగి వెండితెరపై ప్రత్యక్షమైన శ్రీదేవిలో నటనా ప్రతిభ ఏ మాత్రం తగ్గలేదని అందరూ కొనియాడారు. అందుకు ప్రధాన కారణం ఆమె నటించిన ఇంగ్లిష్ వింగ్లిష్ విజయవంతమవడమే. ఆ సినిమా తర్వాతా ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి. కానీ శ్రీదేవి వాటిని ఓకే చెయ్యలేదు. అయితే ఇప్పుడు భర్త బోనీ కపూర్ సారధ్యంలో రానున్న హిందీ సినిమాలో నటించడం ద్వారా ఆమెకు మరింత పేరుప్రఖ్యాతులు రావచ్చని భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.