సహజత్వానికి దగ్గరగా ఉండాలి

నటన అనేది సహజత్వాతినికి దగ్గరగా  ఉండాలి  అంతే తప్ప అతి కూడదని జమున అన్నారు.

అయితే సహజత్వంతో నటించి ప్రేక్షకులను మెప్పించడం అనుకున్నంత సులభం కాదని ఆమె అన్నారు.

నటన అనేది పుట్టుకతో వస్తుంది అనే మాటల్లో కొంత వాస్తవం ఉందని ఆమె అన్నారు. అయితే దానికి మెరుగులు పెట్టినప్పుడే అది రాణింపులోకి వస్తుందని ఆమె చెప్పారు.

స్టేజీ పై నటించి మెప్పించడం ఎంత కష్టమో తెరపై నటించడం అంతకన్నా కష్టమని జమున అభిప్రాయపడ్డారు. ఎందుకంటే స్టేజీపైకి వెళ్ళిన తర్వాత ఆ సీనులో పాత్ర ఉన్నంతసేపూ నటీ నటులు ఎవరైనా ఆ పాత్ర మూడ్ లోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ పాత్ర పండుతుందని ఆమె చెప్పారు. కానీ తెరపైకొచ్చేసరికి ముహూర్తం రోజునే క్లైమాక్స్ తీస్తారు….ఆ పాత్రను సంపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడే క్లైమాక్స్ చేయడానికి వీలవుతుందని, కనుక అవగాహనా శక్తి నటీనటులలో ఏ మాత్రం కొరవడినా క్లిక్ అవడం కష్టమని ఆమె చెప్పారు. సినిమా అనేసరికి ముందు వెనుకలు ఉంటాయని, వరుస ప్రకారం షూట్ చెయ్యరని, మానసికంగా ఆ పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేయగలిగినప్పుడే అనుకున్న ప్రకారం నటించి ప్రేక్షకులను మెప్పించవచ్చని జమున తెలిపారు.

Send a Comment

Your email address will not be published.