సాక్ష్యంతో వస్తున్న బెల్లంకొండ

Bellam konda Srinivasబెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ కి పరిచయమై నాలుగేళ్ళయింది. మూడు సినిమాల్లో నటించారు. ఇప్పిటికే వీవీ వినాయక్, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో కలిసి పని చేసిన బెల్లంకొండ మాట్లాడుతూ, తనకు ప్రారంభమే మంచి ప్రారంభమై కలిసొచ్చిందని అన్నారు. దాంతో పాటు మంచి అవకాశాలు కూడా వచ్చాయని అన్నారు. అయితే కష్టించి పని చేయడాన్నే తాను కోరుకుంటానని చెప్పారు బెల్లంకొండ.

అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమని తెలుసునని అంటూ తనతో కలిసి పని చేయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారంటే గతంలో తన పనితనం తెలిసే అయి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా తనకు వచ్చిన సవాళ్ళను తాను సమర్థంగానే అధిగమించానని చెప్తూ, తనను పక్కదారి పట్టంచిన వారూ లేకపోలేదని, అయితే తాను నెగటివ్ గా ఎప్పుడూ ఆలోచించనని 25 ఏళ్ళ బెల్లంకొండ తెలిపారు.

అలాగే తాను పొగడ్తలకు కూడా ఉప్పొంగిపోనని, విమర్శలనైనా సరే సద్విమర్శలనైనా సరే తాను సమానంగా స్వీకరిస్తానని అన్నారు. ఏదొచ్చినా తాను తన దారిలోనే మలచుకుంటానని, పురోగామికే కృషి చేస్తానని అంటూ, ఎదగడానికి విమర్శలే ముఖ్యమని చెప్పారు. సరైన విమర్శలు ఎప్పటికీ మంచివేనని అన్నారు.

శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ వీడియో గేమ్ డిజైనర్ పాత్ర పోషిస్తున్నారు. తన వయస్సుకు తగ్గ పాత్ర అని బెల్లంకొండ తెలిపారు.
స్టార్ హీరోయిన్లు ఇందులో నటించడం లేదని, అసలు అలాంటి అవసరం కూడా లేదని అన్నారాయన.

Send a Comment

Your email address will not be published.