సాదాసీదాగా "రేయ్"..

దీర్ఘ జాప్యం  తర్వాత సాయి ధరం తేజ్ చేసిన తొలి సినిమా రేయ్ విడుదల అయ్యింది. సాయి ధరం  తేజ్ ఛిరంజీవి మేనల్లుడు కావడంతో ఈ సినిమాలో అతను  ఎలా నటించాడో చూద్దామనిపిస్తుంది.

రేయ్ చిత్రాన్ని వై వీ ఎస్ చౌదరి నిర్మించి దర్శకత్వం కూడా ఆయన చేపట్టారు. సైయామి ఖేర్, శ్రద్ధా దాస్ ప్రముఖ పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి చక్రి సంగీతం సమకూర్చారు.

ఈ చిత్ర కథ జమైకాలో మొదలవుతుంది. సాయి ధరం తేజ్ రాక్ పాత్రలోనూ, సైయామి ఖేర్ అమృత పాత్రలోనూ నటించారు. సాయి ధరం తేజ్ ఆనందంగా కాలాన్ని గడుపుతాడు. అప్పుడప్పుడే పాప్ స్టార్ గా ఎదుగుతున్న అమృత అమెరికాలో జరిగే ఓ పెద్ద కాంపిటీషన్లో పోటీ పడాలని అనుకుంటుంది. రాక్, అతని బృందం అమృత టీం లో చేరుతారు. ఆ బృందాన్ని రేయ్. మరోవైపు జెన్నా పాత్రలో నటించిన  శ్రద్ధా దాస్  అప్పటికే ప్రముఖ పాప్ సింగర్. ఆమె మూడో సారి టైటిల్ కోసం పోటీ పడుతుంది. ఆమె రేయ్ బృందానికి  అడ్డంకులు కలిగిస్తుంది. రేయ్ బృందం పోటీలో పాల్గొనకుండా చేయాలని ఆమె అవాంతరాలు సృష్టిస్తుంది. ఈలోగా అమృత తన సోదరుడి మరణం యాక్సిడెంట్ కాదని తెలుసుకుంటుంది. ఆ తర్వాత వీరిద్దరిలో ఎవరు టైటిల్ గెల్చుకుంటారు అనేదే స్టోరీ.

దర్శకుడు వై వీ ఎస్ చౌదరీ ఈ చిత్రం మీద ఎక్కువ డబ్బే ఖర్చు పెట్టారు. అలాగే మంచి కథలు ఎంచుకుని సినిమాలు తీయడం ఆయన నైజం. అయితే ఈ చిత్రంలో ఎలాంటి ప్రత్యేకతా లేదు. ఈ కథంతా ఎలా సాగుతుందని ముందే ఊహించేలా ఉంది. కథనం చాలా నెమ్మదిగా సాగింది.

ఈ చిత్రంలో మాటలు కూడా అంత గొప్పగా లేవు.

ఈ సినిమా ఇద్దరికే ప్రధానం. వాళ్ళు, సాయి ధరం తేజ్, శ్రద్ధా దాస్.

మొదటి సినిమా అయినప్పటికీ  సాయి ధరం తేజ్ నటన బాగుంది. అతని డ్యాన్స్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. శ్రద్ధా దాస్ కూడా బాగానే ఉంది. ఆమె గ్లామరస్ గానే కనిపించింది. . సైయామి ఖేర్ పరవాలేదు.

వేణు మాధవ్ ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకోలేదు.

నరేష్, హేమ పెర్ఫార్మన్స్ సాధారణంగా ఉంది.

సినీమాటోగ్రఫీ ఓకే. డ్యాన్స్ కొరియోగ్రఫీ సాయి ధరం తేజ్ కి బాగానే ఉపయోగపడింది. అతన తన డ్యాన్సింగ్ ప్రతిభ బాగానే ప్రదర్శించాడు.

నిజానికి రేయ్ సినిమా ఒక సంగీతపరమైన చిత్రం. కానీ చివరికి అదొక ప్రతీకార చిత్రంగా ముగిసింది.

కొన్ని సార్లు సంగీతం చెవులు చిల్లులు పడేటట్లు ఉండి విసుగు పుట్టించింది.

మొత్తం మీద ఈ సినిమా చూడదగ్గ చిత్రమైతే కాదు.

Send a Comment

Your email address will not be published.