సాయి శ్రీనివాస్ జోడీగా సమంతా

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా స్టార్ దర్శకుడు వీ వీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కానప్పటికీ అల్లుడు శ్రీను అనే నామకరణం చేసుకుంటుందని అనుకుంటున్నారు. కథాంశం ప్రకారం ఈ టైటిల్ అన్ని విధాల సరిపోతుందని ఈ చిత్ర యూనిట్ అభిప్రాయం. ఈ సినిమా వెనుక పెను ట్విస్ట్ ఉన్నప్పటికే అదేమిటో ఇప్పుడే చెప్పలేమని చిత్ర యూనిట్ మాట. అదంతా సస్పెన్స్ అని చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన సమంతా నటిస్తున్నారు. డాన్సు, ఫైట్లు సన్నివేశాలలో గొప్పగా నటించిన మరో సూపర్ హీరో దొరికినట్లే అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు సమంతా సౌందర్యం ఓ ప్లస్ పాయింట్ అని,. సమంతా, శ్రీనివాస్ కెమిస్ట్రీ అద్భుతంగా కలిసి నటించినట్లు చెప్పుకుంటున్నారు. దర్శకుడు వీ వీ వినాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారట.

Send a Comment

Your email address will not be published.