సాహసికురాలి పాత్రలో...

sanjana patroనటి సంజనా ఓ టీవీ సీరియల్ లో సాహసికురాలి పాత్ర పోషిస్తోంది. ఈ సీరియల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి ఫేమ్ ప్రసాద్ దేవినేని ఈ సీరియల్ ని నిర్మిస్తున్నారు. దీనికి యాతా దర్శకుడు.
ఇలా ఉండగా, సంజనా మాట్లాడుతూ, ఇది భారీ బడ్జెట్ తో కూడిన సీరియల్ అని, ఈ సీరియల్ షూటింగ్ కోసం రోజూ కనీసం నాలుగు వందల మంది పని చేస్తున్నారని చెప్పింది. దీంతో ఓ సాహసికురాలి వంటి పాత్ర పోషించాలన్న తన కల నెరవేరుతోందని చెప్తూ, అరుంధతిలో అనుష్క పోషించిన జేజమ్మ లాంటి పాత్ర పోషించాలని అనుకుంటూ ఉండేదానినని తెలిపింది. ఆ కోరిక ఇప్పుడు ఈ సీరియల్ తో నెరవేరుతోందని చెప్పింది.
ఈ సీరియల్ కోసం ఆమె కనీసం ఇరవై రోజులపాటు గుర్రపు స్వారీ నేర్చుకుంది. మరో పది రోజులేమో కత్తసాముకు కేటాయించింది. బాహుబలిలో ప్రభాస్ పోషించిన పాత్ర లాంటిదే తనదీనూ అని చెప్తూ తానూ ఈ సీరియల్ లో ఓ సాహసికురాలిగా నటిస్తున్నానని అన్నాది. ఇటువంటి పాత్రలు పోషించాలంటే శారీరక ఆరోగ్యంతోపాటు ఎంత ఫిట్ నెస్ కలిగి ఉండాలో తనకు తెలుసునని, ప్రభాస్, రానాలు అందుకోసం ఎంతగా శ్రమించారో ఊహించగలనని తెలిపింది.

ఓ టీవీ సీరియల్ కు మొట్టమొదటిసారిగా భారీగా ఖర్చు పెడుతున్నారని ఆమె చెప్పింది. తనకు స్ర్కీన్ టెస్ట్ చేసినప్పుడు ఇదొక జానపద కథ అనుకున్నానని, కానీ ఎప్పుడైతే కథను విన్నానో, అలాగే భారీ సెట్స్ చూశానో తాను ఆశ్చర్యపోయానని అన్నాది. ఈ సీరియల్ వెనుక దర్శకుడు యాతా, ఆయన భార్య నవీనా ఆలోచనే ప్రధానమని, గతంలో ఈ దర్శకుడు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో కలిసి పని చేశారని, అంతేకాకుండా ఎన్నో విజయవంతమైన సీరియల్స్ సమర్పించారని చెప్పింది.

షూటింగ్ అప్పుడు ప్రతి రోజూ ఆయన తననెంతో స్పూర్తినిచ్చే వారని ఆమె తెలిపింది.

టీవీ సీరియల్ లో నటించడం వల్ల మీ సినిమా అవకాశాలకు విఘాతం కలగవచ్చేమో అని అడిగినప్పుడు తానేమీ ఈ పరిశ్రమకు కొత్త కాదని, అవకాశాల కోసం అర్రులు చాచేదానిని కానని, ఈ సీరియల్ లో తాను పోషించే పాత్ర ఎంతో బరువైనదని సంజనా చెప్పింది.

Send a Comment

Your email address will not be published.