సిక్స్ ప్యాక్ తో

మిల్కీ బాయ్ మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లో ఎలా ఉంటాడు ? ఆరడగుల అందగాడి గ్లామర్ తగ్గుతుందేమో అని కొంత మంది భయ పడ్డారు కూడా. అయితే, సిక్స్ ప్యాక్ లో మహేష్ ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంత అందంగా ఉన్నాడు. వన్ సినిమా కోసం మొదటిసారిగా మహేష్ సిక్స్ ప్యాక్ లో కనపడనున్నారు.

రాజ కుమారుడు నుంచి … మహేష్ ఇంత వరకూ ఏ సినిమా లోనూ షర్టు లేకుండా కన పడలేదు. పైగా ఆడ పిల్లలు తన చుట్టూ తిరుగు తున్నా ఏమాత్రం పట్టించుకోడు. అందమైన ఆడ పిల్ల వచ్చి నువ్వంటే నాకిష్టం అంటే వేసుకోడానికి జడే లేదు. పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావ్ అని సటైర్ వేసి ఏడిపిస్తాడు. అటువంటి మహేష్ మొదటి సారిగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న వన్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లో కనపడనున్నారు. మరి ఈ సినిమాలో షర్టు తీసి కండలు చూపిస్తారా, లేదా అన్నది తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ బాల నటుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకి ధీటుగా ఉంటుందని దర్శకుడు సుకుమార్ అంటున్నారు. ఇందులో మహేష్ క్యారక్టర్ ప్రవర్తించే తీరు ఊహించడానికి కూడా వీలు కాదు. లండన్ లో కీలక సన్నివేశాలు చిత్రీ కరించిన యూనిట్ ఇప్పుడు మంగళూరు లో షూటింగ్ జరుపుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని డిసెంబర్ రెండో వారం లో విడుదల చేసి ప్రేక్షకులకి సంక్రాంతి కానుక గా ఇవ్వాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ పక్కన కీర్తి సనన్ హీరోయిన్ గా నటించారు.

Send a Comment

Your email address will not be published.