సినీరచయిత హరనాథరావు కన్నుమూత

MVS Haranatha Raoప్రముఖ సినీ మాటల రచయిత, నటుడు ఎం.వి.ఎస్. హరనాథరావు కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు డెబ్బయ్ రెండేళ్ళు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తులు ఉన్నారు.
150కి పైగా సినిమాలకు పనిచేసిన ఎంవీఎస్‌ హరనాథరావు తన కెరీర్ లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.

ప్రతిఘటన, భారతనారీ, అన్న, అమ్మాయి కాపురం తదితర సినిమాలకు అందించిన సాహిత్యానికిగాను ఆయనకు నంది పురస్కారాలు లభించాయి.

ఆయన ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అవార్డులు లభించిన స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు తదితర సినిమాలకు ఆయన కథ, మాటలు అందించారు. అంతేకాదు, ఆయన స్వయంకృషి, ప్రతిఘటన వంటి సినిమాల్లో నటించారు కూడా.

ఆయన గుంటూరులో చదువుకున్నారు. ఆయనకు చిన్నప్పటినుంచే నాటకాల అంటే పిచ్చి అభిమానం.

చిన్నప్పుడు అనేక నాటకాల్లో ప్రముఖ పాత్రలు పోషించిన ఆయన అనంతరం పలు నాటకాలకు రచన చేశారు.

కాలేజీలో రోజుల్లోనే ఆయనకు దర్శకుడు టీ కృష్ణతో పరిచయముండేది. ఆ పరిచయం వారి మధ్య గాఢమైన స్నేహబంధానికి పునాదులు వేసింది.

ప్రతిఘటన, భారతనారీ, ఇదా ప్రపంచం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచి దొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, ధర్మచక్రం వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆయన మంచి చిత్రాలకు సాహిత్యమందించిన రచయితగా ఎనలేని ఖ్యాతి ఆర్జించారు.

Send a Comment

Your email address will not be published.