సి బీ ఐ ఆఫీసర్ గా ప్రియమణి

దర్శకుడిగా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పీ పట్నాయిక్ ఆధ్వర్యంలో ద్విభాషా చిత్రం రూపు దిద్దుకుంటోంది. అటు తెలుగులోనూ, ఇటు కన్నడంలోనూ రాబోతున్న ఈ చిత్రం లో ప్రియమణి సి బీ ఐ ఆఫీసర్ గా నటిస్తున్నది. ఇప్పటిదాకా అనేక సినిమాల్లో ఆమె గ్లామరస్ పాత్రల్లోనే నటించింది. అయితే ఈ చిత్రంలో ఆమె శక్తిమంతమైన సి బీ ఐ ఆఫీసర్ గా నటిస్తోంది అని ఆర్ పీ పట్నాయిక్ చెప్పారు. సి బీ ఐ ఆఫీసర్ గా నటించడానికి ఆమె ఎన్నో జాగర్తలు తీసుకున్నారని సాయన చెప్పారు.

“ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం…ఇందులో కథాంశం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడతాయి…” అని పట్నాయిక్ తెలిపారు.

“నేను ఈ చిత్ర కథ చెప్తుంటే ప్రియమణి ఎంతో ఆసక్తిగా విన్నారు. కథలో మమేకమయ్యారు. అప్పటికప్పుడు ఆ క్యారక్టర్ లో నటిస్తున్నట్టు ఆమె ఫీల్ అయ్యారు…కర్తవ్యం చిత్రంలోని విజయశాంతి పాత్రతో ప్రియమణి పాత్రను పోల్చవచ్చు…” అని కూడా ఆయన అన్నారు….

ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెలలో గానీ వచ్చే నెలలో గానీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Send a Comment

Your email address will not be published.