సి బీ ఐ ఆఫీసర్ గా బాలయ్య

రానున్న నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఈ షూటింగ్ హైదరాబాద్ చుట్టుపక్కల సాగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకించి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసారు. ఆ స్టేషన్ లోనే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్రంలో బాలకృష్ణ సి బీ ఐ ఆఫీసర్ గా నటిస్తున్నారు. వై ఎస్సార్ సీపీ అధినేత జగన్ రెడ్డి కేసుతో పాపులర్ అయిన అసలైన సి బీ ఐ ఆఫీసర్ జె డీ లక్ష్మీనారాయణ మూలంగా చేసుకుని ఈ చిత్ర కథ సాగుతోంది.

జగన్ రెడ్డి కేసులోని కొన్ని సన్నివేశాలను ఈ చిత్రంలో కలుపుతున్నట్టు అభిజ్ఞ వర్గాల భోగట్టా.

ఈ చిత్రంలో త్రిషా, రాధిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.