సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

రాజ్ తరుణ్, ఆర్తన, షకలక శంకర్ , రాజా రవీంద్ర, ఆదర్శ్ బాలకృష్ణ, నవీన్, సురేఖావాణి, శ్రీలక్ష్మితదితరులు నటించిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాకు గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి , అనిల్ మల్లెల రాయగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే కూడా శ్రీనివాస్ గవిరెడ్డివే. శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి త్రయం ఈ ఛిత్రాన్ని నిర్మించారు.

తన వైవిధ్యభరిత నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని కూడగట్టుకున్న రాజ్ తరుణ్సి నటించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే ఆశిస్తున్నారు నిర్మాతలు.

అది రామచంద్రాపురం అనే ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో ఏ బాధ్యతా లేకుండా మిత్రులతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు రాజ్ తరుణ్ శ్రీరామ్ క్యారక్టర్ లో. అతనికి ఎదురింట్లో ఉన్న సీతామాలక్ష్మి అంటే ప్రాణం. ఆర్తన సీతామాలక్ష్మి పాత్రలో నటించింది.

కథాపరంగా రాజ్ తరుణ్ ఇంటర్ కూడా పాస్ అయి ఉండడు. అయితే ఎంబీబీఎస్ చదువుతున్న సీతామాలక్ష్మి తనను ప్రేమిస్తోంది అనుకుని తప్పుగా అర్ధం చేసుకుని ఆమెతో తన ప్రేమను చెప్తాడు. అయితే ఆమె అతనితో ప్రేమా లేదు దోమా లేదు అంటుంది. కానీ శ్రీరామ్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న తర్వాత అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. ఇంతలో ఈ విషయం తెలిసి సీతామాలక్ష్మి తండ్రి ఆమెకు మరొకరితో పెళ్లి నిశ్చయిస్తాడు. అయితే రాజ్ తరుణ్ ఎలా తన ప్రేమను సాధించుకున్నాడు అనే వివరాలను తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

శ్రీనివాస్ గవిరెడ్డి నూతన దర్శకుడు అయినా పాత కథనాన్నే చూసుకుని ఎంచుకున్నాడు. అందులోకి రాజ్ తరుణ్ ని ఇమడ్చి మనముందు ఉంచారు.

సినిమాలో ప్రతి సన్నివేశం ముందెప్పుడో చూసామా అనిపిస్తుంది. కథంతా రొటీన్ గా అనిపిస్తుంది. అయినప్పటికీ దర్శకుడు ఈ కాలం యువతను ఆకట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నించారు.. శంకర్ కామెడీ బాగానే ఉంది. పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్వించాడు.

రాజ్ తరుణ్ కొన్ని సన్నివేశాలలో బాగా నటించాడు. ఆర్తన నటన అంతగా చెప్పుకోదగ్గ రీతిలో లేదు. అక్కడక్కడా అందంగా కనిపించింది ఓ మోస్తరు. రాజారవీంద్ర బాగానే నటించారు.

సరదాగా ఓ మారు చూడొచ్చు. కాలక్షేపం సినిమాయే తప్ప పదికాలాలు నిలిచిపోయే చిత్రం మాత్రం కాదు.

Send a Comment

Your email address will not be published.