సూపెర్ కాంబినేషన్...

Pawan Kalyan_Trivikramపవర్ స్టార్ పవన్ కళ్యాన్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో సూపర్ హిట్ కొట్టిన చిత్రాలు జల్సా, అత్తారింటికి దారేది…ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కలయికలో మరో చిత్రం రాబోతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమాన్యుఎల్ నటించబోతున్నారు. వచ్చే ఫిబ్రవరి కల్లా పవన్ కళ్యాన్ నటిస్తున్న కాటమరాయుడు చిత్రం పూర్తి కావడంతో అతని తదుపరి చిత్రం మొదలవుతుందని సన్నిహిత వర్గాల మాట.

పవన్ కళ్యాన్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఒ కొత్త చిత్రం రాబోతోందని ఓ ప్రకటన రావడంతోనే అభిమానులు ఆ చిత్రం పై బోలెడు అంచనాలు పెట్టుకుంటారు. వీరితో రాబోయే ఈ కొత్త చిత్రం కూడా సూపర్ హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తారు. వీరిద్దరూ అత్యంత సన్నిహితులే కాదు…వ్యక్తిగతంగానూ ఎంతో దగ్గరైన వారు. అందుకే వీరి కాంబినేషన్ లో వృత్తిపరంగానూ మంచి చిత్రం రూపుదిద్దుకుంటుందని అభిమానుల ఆశ. అందుకే వారు మరో మంచి కమర్షియల్ చిత్రాన్ని ఎదురు చూడవచ్చని భావిస్తున్నారు. ఏ మాత్రం ఎమోషన్ మిస్సవకుండా చిత్రాలు తీయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ ముందు ఉంటారు అనడంలో ఏ సందేహమూ లేదు. ఈ చిత్రానికి తమిళ పరిశ్రమకు చెందిన అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తారని అనుకుంటున్నారు. అదే నిజమైతే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనిరుద్ ఓ చిత్రం చేయడం ఇదే మొదటి చిత్రమవుతుంది. హారిక, హాసిని బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతుందని అనుకుంటున్నారు.

పవన్ కళ్యాన్ అభిమానులు ప్రస్తుతం ఆయన నటిస్తున్న కాటమరాయుడు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.