సెన్సార్ అంగీకరించలేదు

గొల్లభామ అనే సినిమాలో మోహిని పాత్రతో నటనకు శ్రీకారం చుట్టిన అంజలి దేవి సీత, అనసూయ, సక్కుబాయి తదితర పాత్రల ద్వారా తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సంగతి తెలియంది కాదు.

ఆమె ఒక సారి సెన్సార్ గురుంచి మాట్లాడుతూ ఈ కింది విషయం చెప్పారు…

“సెన్సార్ ఎక్కడ? సెన్సార్ ఏమైంది? అసలు సెన్సార్ అంటూ ఉందా..? మేము నిర్మించిన భక్తతుకారం అనే సినిమాలో నాగభూషణం పాత్రకు చేయి తెగి రక్తం కనిపించింది. అయితే రక్తం అలా కనిపించడాన్ని ఆరోజుల్లో సెన్సార్ వారు అంగీకరించలేదు. మరి ఇప్పుడు సినిమాల్లో కత్తితో పొడవడం, చిత్రవధ చేయడం, ముఖంపై రక్తం చిమ్మడం, వంటివి యదేచ్చగా చూపిస్తున్నారు. ఇటువంటి సన్నివేశాలకు సెన్సార్ లేదా? మరో విషయం….ఒక సినిమాలో ఆ రోజుల్లో క్లియోపాత్రా వేషం కోసం బిగుతు డ్రెస్ నేను నటిస్తే సెన్సార్ వారు ఒప్పుకోకపోతే తిరిగి చిత్రీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు మరి డ్రెస్ గురించి విడిగా చెప్పాల్సిన పని లేదు కదా…? “

Send a Comment

Your email address will not be published.