సొగసు చూడతరమే

నటి తమన్నా సోయగమే వేరు. అందమైన నవ్వుకు, సొగసుకు చిరునామా అయిన తమన్నా దక్షిణాది సినీ జగత్తులో బిజీ బిజీ తారయే. ఈమధ్య తెలుగు పరిశ్రమలో కొంచం గ్యాప్ వచ్చినప్పటికీ ఆమె అప్పుడప్పుడూ వెండితెరపై ఓ మెరుపు మెరిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఈ రంగుల ప్రపంచంలో తనకు విశేష ఆదరణ లభించడానికి ముఖ్యకారణం నటనలో ప్రతిభ ఉండటంతోపాటు చెప్పుకోదగ్గ సోయగమే అని అంటూ ఉంటుంది తమన్నా. నటన విషయాన్ని పక్కన పెడితే అందంకోసం తాను ఎక్కువ జాగర్తలే తీసుకుంటానని  చెప్పింది.

తాను తప్పనిసరిగా ప్రతీ రోజూ ముప్పై నిమిషాలు తగ్గకుండా శారీరక వ్యాయాయం చేస్తుంటానని చెప్పిన తమన్నా అవసరమనుకుంటే సాయంత్రం కూడా ఫీట్ నెస్ కోసం వ్యాయాయం చేస్తానంది.

యోగాలో భాగంగానే డ్యాన్స్ విషయాన్ని చెప్తూ ముఖవర్చస్సు కోసం బోలెడంత శ్రద్ధ తీసుకుంటానని తమన్నా తెలిపింది.  బరువు తగ్గించుకోవడానికి యోగా బాగా తోడ్పడుతుందని అన్నాది. దేహాన్ని శుభ్రపరచుకోవడానికి మాయిశ్చరైజింగ్ సబ్బులను వాడే తమన్నా చర్మం ముడతలు పడకుండా ఉండటానికి సెనగ పిండి నలుగు పెట్టుకుంటుంది.

ఉదయం బ్రెడ్డు, ఆమ్ లెట్టు అల్పాహారంగా తీసుకునే తమన్నా మధ్యాన్నం లంచ్ మితంగానే చేస్తుంది. ఆకలి కదాని ఒకే సారి ఎక్కువ తిని అవస్థలు తెచ్చుకోవడం కన్నా కొద్దికొద్దిగా అప్పుడప్పుడూ తినడం మంచిదని చెప్పింది.

ఆమెకు చికెన్ అంటే చాలా ఇష్టం.

Send a Comment

Your email address will not be published.