‘సోగ్గాడే చిన్నినాయనా’

తండ్రీ కొడుకుగా నాగార్జున తొలి ప్రయోగం

సంక్రాంతి పండుగకు అక్కినేని నాగార్జున గొప్ప కానుకే ‘సోగ్గాడే చిన్నినాయనా’

నాగార్జున తన కెరీర్ లో తండ్రీకోడుకుగా రెండుపాత్రాలూ పోషించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి , అనుష్క , నాజర్ , హంసానందిని , అనసూయ తదితరులు నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మూలకథ రచయిత రామ్మోహన్ కాగా సత్యానంద్ స్క్రీన్ ప్లే సిద్ధం చేసారు. కళ్యాణ్ కృష్ణ రచన, దర్శకత్వం చేపట్టగా ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున నిర్మించారు.

‘సోగ్గాడే చిన్నినాయనా’ కథలోకి వెళ్తే….

బంగార్రాజు జమీందారు కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను ఓ ప్రమాదంలో ప్రాణాలు పోయి నరకానికి వెళ్తాడు. బంగార్రాజు మంచి రసికుడు. కనుక అతను నరకంలోనూ అమ్మాయిలతో సరసాలాడుతుంటాడు. అయితే కింద ఉన్న అతడి భార్య అతణ్ని తిడుతూ కిందకు రమ్మని పోరుపెడుతుంది. అది ఈశ్వరేచ్ఛ అనుకుని యముడు సరేనని బంగార్రాజుకు గడువు పెట్టి భార్య దగ్గరకు పంపుతాడు. తీరా . కిందకు వచ్చేసరికి బంగార్రాజు కొడుకు రాము తండ్రికి పూర్తి భిన్నంగా ఉంటాడు. రాముకి పనే లోకం. మరేదీ పట్టదు. దానితో అతని నుంచి దూరమై పోవాలని అనుకుంటుంది అతని భార్య సీత. బంగార్రాజు తన భార్య ఈ విషయమై పడుతున్న తర్జనభర్జనను గ్రహించి కొడుకు, కోడల్ని కలపాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను తన కుటుంబాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవాల్సి వస్తుంది. బంగార్రాజు ఇవన్నీ ఎలా సాధించాడు అని తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే.

ఈసారి నాగార్జున పోషించిన పాత్రలు రెండూ అభిమానుల్ని అలరించేవే…చిలిపి అల్లరితో ఆకట్టుకున్నాడు నాగార్జున అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా రొమాన్స్ విషయంలో నాగార్జున గురించి వేరేగా చెప్పక్కరలేదు. అలాంటి పాత్రలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్యే. అతని రొమాంటిక్ నటన అద్భుతం.

హాయిగా సకుటుంబంతో వెళ్లి చూడదగ్గ ఈ చిత్రంలో రమ్యకృష్ణ చెప్పుకోదగ్గ ఆకర్షణే. ఆమె నటన కూడా అమోఘం.

లావణ్య త్రిపాఠి తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అనుష్క గురించి చెప్పాడానికి ఏమీ లేదు.

అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్ర పాటలు బాగున్నాయి. సన్నివేశానికి తగ్గట్టు ఉన్నాయి.

కళ్యాణ్ కృష్ణ కొత్త దర్శకుడే అయినా అనుభవమున్న దర్శకుడిలా సినిమాను నడిపించాడు. ఆటను రాసిన మాటలు కూడా బావున్నాయి. సత్యానంద్ స్క్రీన్ ప్లే ఓకే. .

మొత్తానికి మంచి సినిమా చూసామన్న తృప్తి కలిగించేదే ‘సోగ్గాడే చిన్నినాయనా’

Send a Comment

Your email address will not be published.