1: నేనొక్కడినే

రేటింగ్ : 3/5
బ్యానర్ : 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్
తారాగణం : మహేష్ బాబు, కృతి సానన్, నాజర్, కెల్లీ దార్జ్, పోసాని కృష్ణ మురళి.
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర.
రచన, దర్శకత్వం : బి. సుకుమార్.

తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోసం సంక్రాంతి కానుకగా శుక్రవారం ‘1 నేను ఒక్కడినే’ సినిమా విడుదల అయింది. సంక్రాంతి సినిమా అనగానే ఆతరం ప్రేక్షకుల నుంచి నిన్న మొన్నటి వరకూ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ దే ఉండేది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కి కృష్ణ సినిమా విడుదల కావడం, సూపర్ హిట్ కావడం ఆనవాయితీ గా ఉండేది. అందుకే ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులు మొత్తం కృష్ణని సంక్రాంతి హీరో అని ముద్దుగా గర్వంగా పిలిచే వారు. ఇప్పుడు కృష్ణ తనయుడు మహేష్ బాబు కూడా సంక్రాంతి హీరో అనిపించు కోవాలని ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది కూడా మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సంక్రాంతికే విడుదల అయి ఘన విజయం సాధించింది. మరి మూడు సినిమాల వరస విజయాలతో పాటు సంక్రాంతి సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ఘట్టమనేని సెంటిమెంట్ ని నిలబెడుతుందా ? ఈ సినిమా కి మరో ప్రత్యేకత కూడా ఉంది. కృష్ణ మనమడు, మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ కూడా నటించడం.

ఆర్య, 100 % లవ్ వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ బాబు, కృతి సానన్ జంటగా నటించిన ఈ సినిమా కధ విషయానికి వస్తే, గౌతమ్ ( మహేష్) ఒక రాక్ స్టార్. అయితే స్టేజి షోలతో, ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో హాయిగా ఆనందంగా ఉండాల్సిన జీవితం పీడ కలలతో చాలా సీరియస్ గా ఉంటుంది. అందుకు కారణం అతనికి వచ్చే పీడ కలలు. అవి నిజమే అనుకొని గౌతమ్ కలలో వేధించిన వారినంతా వరసగా చంపేస్తాడు. చిన్నప్పుడు తన తల్లి తండ్రుల్ని చంపిన వారే కలలో వస్తున్నారని గౌతమ్ గట్టిగా విశ్వసిస్తాడు. అందుకే వారిని వరుసగా చంపేస్తాడు. పీడకలల్లో వస్తున్న వారిని చంపడానికి బయలు దేరిన ప్రయాణంలో అతనికి సహాయం చేస్తుంది జర్నలిస్ట్ సమీర( కృతి). మరి గౌతమ్ తల్లి తండ్రులు ఎవరు, వారిని ఎవరు హత్య చేస్తారు అన్నదే అసలు కధ.

అస్సలు కామెడి ట్రాక్ లేకుండా ఆద్యంతం పూర్తి గా సీరియస్ గా సాగిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఆదరిస్తారో తెలియాల్సి ఉంది

Send a Comment

Your email address will not be published.