ఆచితూచి అడుగులు

Akhil-movieనాగార్జున అక్కినేని తన చిన్నకొడుకు అఖిల్ నటించిన అఖిల్ చిత్ర విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరిగా అఖిల్ కు ఇదే మొదటి చిత్రం. అతని చిత్ర వ్యవహారంలో నాగార్జున ఆచితూచి అడుగులు వెయ్యడానికి కారణం తన పెద్ద కొడుకు నాగచైతన్య మొదటి చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడమే. ఆ చిత్రం వాసు వర్మ ఆధ్వర్యంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫ్లాప్ కావడానికి నాగార్జున తననే విమర్శించుకున్నారు. అలాంటి పొరపాటు ఇప్పుడు తన చిన్నకొడుకు అఖిల్ విషయంలో జరగకూడదని నాగార్జున ఎన్నో జాగర్తలు తీసుకుంటున్నారు.

అఖిల్ చిత్రం అక్టోబర్ 22న విడుదల కావలసింది. అయితే ఉన్నట్టుండి ఆ తేదీన సినిమా విడుదల చెయ్యడం లేదని స్వయంగా ప్రకటించిన నాగార్ఝున అఖిల్ చిత్రంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్టు గుర్తించారు. దానితో ఇప్పుడు వాటిని సరిచేసే పనిలో పడ్డారు నాగార్జున, అమల. వీరిద్దరూ సరాసరి అఖిల్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు మళ్ళీ చిత్రీకరిస్తుంటే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పొరపాటు లేకుండా చక్కని సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సినిమా ఇప్పుడు దీపావళి నాటికి విడుదల అవుతుంది. ముఖ్యంగా పులితో అఖిల్ ఫైట్ సీన్ అంత బాగా రాలేదని నాగార్జున అభిప్రాయపడ్డారు.అది చూస్తుంటే ఏదో కార్టూన్ అనిమేషన్ లా ఉందని , ఇక్కడ రీ వర్క్ అవసరమైనదని నాగార్జున అన్నారు.

ఈరోజుల్లో టాలీవుడ్ కు వస్తున్న ప్రతి నటుడిపైనా ఎంతో ఒత్తిడి ఉంటోందని , ఎవరికి వారు సరిగ్గా నటించకపోతే విమర్శలు ఎదుర్కోవడం ఖాయమని, కనుక తన కొడుకు అఖిల్ విషయంలో తానూ దగ్గరుండి కొన్ని మార్పులూ చేర్పులూ చెయ్యక తప్పలేదని నాగార్జున అన్నారు.

Send a Comment

Your email address will not be published.