"అజర్" ట్రైలర్ విడుదల

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ పై రూపొందుతున్న చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ చిత్రంలో నటిస్తున్న వారందరూ ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇమ్రాన్ మాట్లాడుతూ అజర్ పాత్ర పోషించడం అంత సులభం కాదని, త్వరలోనే తొలి కాపీ అజర్ కు చూపిస్తానని, ఆయన మెచ్చుకోలు ఎంతో ప్రధానమని చెప్పారు. తాను ఈ చిత్రం కోసం ఎంతో సమయం ఆయనతో గడిపానని చెప్పారు. ఆయన ఎంతో ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడుతారని అన్నారు. ఆయన ఎన్నో సూచనలు చేసారని, 1980 , 90 దశకాల్లో తాను అజర్ ని వాచ్ చేసానని, బ్లూ జెర్సీ ధరించడం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ఆరోపణలు ఎదుర్కొన్న అజర్ ని తాము అడిగినప్పుడు ఆయన “ఈ వ్యవహారంలో నేను ఎవరినీ నిందించడం లేదు. బహుశా అదిఒ నా గమ్యం అయి ఉండవచ్చు. అయితే ఆ ఆరోపణల నుంచి నన్ను విముక్తి కల్పించినప్పుడు ఎంతో సంతోషించాను” అని చెప్పారని ఇమ్రాన్ అన్నారు.
ఈ చిత్రంలో సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, ముద్దుల సన్నివేశాలు లేకుంటే ప్రేక్షకులు డిసపాయింట్ తో వస్తారని అజర్ నవ్వుతూ చెప్పారు.
లారాదత్ లాయర్ పాత్ర పోషిస్తోంది. అజర్ ని కోర్టుకి లాక్కొచ్చిన పాత్ర. అది.
ఆమె తన పాత్ర గురించి మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ఓ రెఫెరెన్స్ ఉందని, తన పాత్రకే లేదని అన్నారు లారాదత్. తాను దర్శకులతో కూర్చుని ఈ కేసు మీద ఎంతో రీసెర్చ్ చేసానని చెప్పారు.
దర్శకులు టోనీ డి సౌజా మాట్లాడుతూ ఈ చ హిత్రం కేవలం అజర్ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువేనని చెప్పారు. ఈ చిత్రంలో ఆరోపణలు ఎదుర్కొన్న మరి కొందరు క్రికెటర్స్ గురించి కూడా కొన్ని పాత్రలు చూడవచ్చని తెలిపారు.

Send a Comment

Your email address will not be published.