2 స్టేట్స్ రీమేక్

బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన 2 స్టేట్స్ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించడానికి అభిషేక్ పిక్చర్స్ వారు సంబంధిత హక్కులు కొనుగోలు చేసారు. హిందీలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. తెలుగులో నాగచైతన్య, సమంతా జంటగా నటించబోతున్నారు.

ఈ చిత్రానికి మూల కథ ప్రముఖ రచయిత రాసిన నవల కావడం విశేషం. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ తానూ హిందీ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించబోతున్నట్టు తెలిపారు. వీ వీ వినాయక్ తో కలిసి పది సంవత్సరాలు పైనే వర్క్ చేసిన వెంకట్ కుంచెంను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాను అని తెలిపారు. హిందీలో ఈ చిత్ర అధినేత కరణ్ జోహార్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలకు సంబంధించిన హక్కులను ఇప్పటికే విక్రయించారు కరణ్ జోహార్. అభిషేక్ దాదాపు 55 లక్షల రూపాయల మేరకు చెల్లించి తెలుగులో పునర్నిర్మించడానికి హక్కులు సొంతం చేసుకున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుందని ఆయన చెప్పారు. నాగచైతన్య, సమంతాలతో పాటు ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్యకృష్ణ, రేవతి, తదితరులు ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయి.

ఇలా ఉండగా జనతా గ్యారేజ్ లో నటించిన సమంతా ఆ తర్వాత ఇప్పటి దాకా టాలీవుడ్ లో మరో సినిమాలో నటించలేదు.

Send a Comment

Your email address will not be published.