సిద్దు సమంతల పెళ్లి అయిందా?

టాలివుడ్ హీరోల కలల రాణి సమంత.

అగ్ర కధానాయకులు కూడా తమ పక్కన మళ్ళీ మళ్ళీ సమంతానే హీరొయిన్ గా ఉండాలని పట్టు పడుతున్నారు. నిర్మాతలు ఐతె హీరో కాల్ షీట్స్ దొరక్క పోతే పరవా లేదు. సమాంత డేట్స్ ఇస్తే చాలు కాసులు కురుస్తాయని నమ్ముతున్నారు. కానీ ప్రేక్షకుల్ని, హీరోలని, నిర్మాతలనీ నిర్ఘాంత పరిచే టాక్ ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే సమంత అతి తొందరలో సినిమాలకు గుడ్ బై చెప్పనుంది. అందుకు కారణం తన బాయ్ ఫ్రెండ్ సిద్దు ని త్వరలో పెళ్లి చేసుకో నుండడమే.

బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో సూపర్ సక్సెసని సాధించిన సిద్ధూ తో సమాంత ప్రేమలో పడిందనే వార్తలు గత కొంత కాలం గా వినిపిస్తున్నై. ఇప్పుడు మాత్రం సమంత సిద్దుని పెళ్లి చేసుకొని సినిమా లకు బాయ్ చెప్పనుందని టాక్. నిర్మాతల్నికలవర పెడుతున్న మరో విషయం వారి పెళ్లి అయిందని. నిజం వారిద్దరికే తెలిసినా నిర్మాతలకి, హీరోలకి, అభిమానులకి నిద్ర లేకుండా పొయింది.

Send a Comment

Your email address will not be published.