తుఫాన్

మగధీర, రచ్చ వంటి సూపర్ హిట్స్ తో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ టాలీవుడ్ చరిత్ర తిరగరాస్తే,
* తుఫాన్* సినిమాతో బాలివుడ్ లో ఇచ్చిన ఎంట్రీ *0* రేటింగ్ తో బాలివుడ్ చరిత్ర ని తిరగరాశాడు.

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తొలిసారి హిందీ లో నటించిన *జంజీర్* సినిమా గత వారం దేశవ్యాప్తం గా విడుదల ఐంది. బ్యూటీ గర్ల్ ప్రియాంక చోప్రా హీరొయిన్ గా నటించిన ఈ సినిమా ని తెలుగులో * తుఫాన్* గా విడుదల చేసారు.

యాంగ్రీ యంగ్ మెన్ గా అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమా రీమేక్ లో రామ్ చరణ్ హీరోగా నటించాడు. తెలుగులో మగధీర వంటి సినిమా లో కాలభైరవుడి గా విమర్శకుల ప్రసంసలు కూడా పొందిన చరణ్ జంజీర్ లో మాత్రం పూర్తిగా చతికిల పడ్డాడు. అమితాబ్ కి హీరోగా బాలివుడ్ లో తిరుగు లేని ఇమేజ్ సాధించి పెట్టిన ఈ సినిమా రామ్ చరణ్ ని మాత్రం పూర్తిగా ముంచేసింది. అందుకు కారణం మాత్రం చిరు, రామ్ ల స్వయం క్రుతపరాధమే అని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. అమితం వంటి నటనా దిగ్గజం నటించిన సినిమా కాకుండా మరో కొత్త స్టొరీ తో రామ్ బాలివుడ్ లో అడుగు పెట్టి ఉంటె మొదటి సినిమా తోనే సక్సెస్ సాధించే వాడని ఇంట పరాజయం మూట కట్టుకునే వాడు కాదని భావిస్తున్నారు. 149 సినిమా లతో అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్న చిరంజీవి ఈ విషయం లో రామ్ ని సరిగ్గా గైడ్ చేయలేదని అభిమానులు భావిస్తున్నారు. బాలివుడ్ కి రామ్ చరణ్ ఫై ప్రేక్షకులకి ఎటువంటి అంచనాలు ఉండవు కనుక ఇబ్బంది ఉండదు అనే కోణం లోనే మెగా క్యాంపు ఆలోచించినట్టు కనపడుతుంది.అమితాబ్ నటించిన సినిమా రీమేక్ లో అనామకుడు నటించినా
అభిమానుల అంచనాలు భారీ గా ఉంటాయని హీరో, దర్శక, నిర్మాతలు అంచనా వేయలేక పోయారు. హీరొయిన్ ప్రియాంక చోప్రా అందాన్నిఉపయోగించు కోలేదు. సంజయ్ దత, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ఉన్నా
జనాన్ని సినిమా కి రప్పించ లేక పోయారు. తెలుగు నాట మెగా అభిమానులు సమైక్య ఉద్యమ దెబ్బ సినిమా విడుదలపై పడకుండా చూడ గల్గిన సినిమా పరాజయాన్ని మాత్రం ఆపలేక పోయారు.

Send a Comment

Your email address will not be published.