అంత రాద్ధాంతం చేయక్కర లేదు

ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ జీవితం ఆధారంగా చేసుకుని వెండితెరకెక్కిన చిత్రం మేరికోం. ఇందులో ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్ర పోషించింది.

ఈ సినిమాలో పాత్ర కోసం ఆమె తన శరీరాకృతిలో అనేక మార్పులు చేసుకుంది. చూడగానే మేరీకోం తలంపునకు వచ్చే విధంగా ఉండాలని ఆమె తన శరీరాన్ని మార్చుకుందని కొందరు విమర్శించారు. మరోవైపు బాలీవుడ్ లోనూ ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే ప్రచారం చేసింది. మీడియాలోనూ విపరీతమైన ప్రచారం జరిగేటట్టు చూసుకుంది సినీ యూనిట్.

అయితే ఈ సినిమా ఇటీవల విడుదల అయిన తర్వాత ప్రశంసలతోపాటు ప్రతివిమర్శలు కూడా అంతే మోతాదులో వచ్చాయి. స్పూర్తిదాయకమైన పాత్రలో ఆమె నటన ఎంతో గొప్పగా ఉందన్న మీడియా మరోవైపు ఆమెను విమర్శించింది. దానితో బాలీవుడ్ మీడియా పై ప్రియాంకా చోప్రా మండిపడింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ సినిమానైనా నటన, శ్రమ, కథ ఆధారంగానే చూడాలని, మేల్ ఓరియెన్ టెడ్ అని, లేడీ ఓరియెన్ టెడ్ అని విడదీసి చూడకూడదని చెప్పారు. సినిమాను సినిమాగా చూడాలని అన్నారు. మేల్ …లేడీ అనే పదాలు వాడటం సరికాదని చెప్పారు. ఈ మధ్య కాలంలో కధానాయిక ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు నెగటివ్ ప్రచారం వచ్చేలా విమర్శలు వస్తున్నాయని, ఆ పద్ధతి మంచిది కాదని అన్నారు. నటనలో తాము ఎంత వరకు విజయం సాధించాం అనే కోణంలో విమర్శలు ఉండాలని సూచించారు. అప్పుడే లేడీ ఓరియెన్ టెడ్ సినిమాలకు ఆదరణ లభిస్తుందని ప్రియాంకా చోప్రా అభిప్రాయపడ్డారు. మీడియా అసంతృప్తి వ్యక్తం చేసినా తాను ఈ సినిమా విషయంలో సంతృప్తిగానే ఉన్నానని ఆమె చెప్పారు.

Send a Comment

Your email address will not be published.