అందుకేనట రాహుల్..

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముద్దుల కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నట్టుండి ఎవరికీ కనిపించకుండా పోతుంటాడు. అటువంటప్పుడు ఆయన ఎక్కడ ఉంటారన్నది ఒకరిద్దరు సన్నిహితులకు తప్ప మరెవ్వరికి తెలియదట. పనుల ఒత్తిడి నుంచి బయట పడటానికి రాహుల్ గాంధీ ఆకస్మికంగా విదేశాలకు  వెళ్ళడం అలవాటు. అలా వెళ్ళేటప్పుడు అత్యంత సన్నిహితులకు మాత్రం తాను ఎక్కడికి వెళ్తున్నదీ చెప్పి వెళ్తాడు. అలా రాహుల్ జీ ఎక్కువగా వెళ్ళే దేశం థాయిలాండ్. ఇంతకూ అక్కడికి ఎందుకు వెళ్తున్నట్టు అని ఆరా తీయగా తెలిసిందేమిటంటే రాహుల్ గాంధి అక్కడ ధ్యానం చేస్తాడట. ఇందువల్ల హాయిగా ఉందని, నూతన ఉత్తేజంతో తిరిగి మన దేశానికి వచ్చి మళ్ళీ బిజీ అవుతానని రాహుల్ చెప్పుకున్నాడు. అంతేకాదు ఇలా థాయిలాండ్ వెళ్లి ధ్యానం చేసి వస్తే మంచిదని ఆయన సన్నిహితులకు చెప్పారు కూడా.

Send a Comment

Your email address will not be published.