అక్షర జ్యోతి ప్రధమ వార్షికోత్సవం

అక్షర జ్యోతి ప్రధమ వార్షికోత్సవం

అక్షర జ్యోతికో వసంతం తిరిగింది
చిన్నారుల కన్నుల్లో అక్షరాల జ్యోతి వెలిగింది
వెన్నెల కాంతి కూడా వెల వెలా బోయింది
తెలుగు తల్లి మనసంతా మంగళ వాద్యాలతో నిండింది

మెల్బోర్న్ తెలుగు సంఘం అధ్వర్యంలో ఈ నెల 28 వ తేదీన అక్షర జ్యోతి (తెలుగు బడి) ప్రధమ వార్షికోత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి తాయి సంఘం అధ్యక్షులు శ్రీ దినేష్ గౌరిశెట్టి మరియు కార్యవర్గ సభ్యులు, అక్షర జ్యోతి ఉపాధ్యాయులు, సమన్వయ కర్తలు హాజరైనారు. ఈ సందర్భంగా అక్షర జ్యోతి కార్యదర్శి శ్రీ విద్యా మోహన్ బొమ్మెన మాట్లాడుతూ ఈ బడి దిగ్విజయంగా నడవడానికి పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో సహకరిస్తున్నారనీ, ఉత్సాహాన్ని చూపిస్తున్నారనీ చెప్పారు. ప్రస్తుతం ఈ బడిలో తెలుగు నేర్చుకోవడానికి 28 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు వచ్చి శ్రద్ధగా తెలుగు భాషను నేర్చుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు మరియు తాయి సంఘానికి శ్రీ విద్యా మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆధునిక పద్ధతిలో పాఠ్యంశాలు తయారుచేయడం ద్వారా బోధనాపధ్ధతి సులభతరం కావడం పిల్లల అవగాహనకు తోడ్పడిందని, ఇదంతా ఇక్కడ స్వచ్చందంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల వల్లనే సాధ్యపడిందని శ్రీ దినేష్ గారు తెలిపారు. పిల్లలందరికీ ప్రశంసా పత్రాలు అందివ్వడంతో కార్యక్రమం ముగిసింది.

Send a Comment

Your email address will not be published.