అగ్రశ్రేణిలో హైదరాబాద్

హైదరాబాద్ నగరం పారదర్సకతలో రెండో స్థానాన్ని, పట్టణ పాలనలో అయిదవ స్థానాన్ని సాధించింది. జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజెన్షిప్ అండ్ డెమోక్రసీ అనే సంస్థ 2016 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఒక అధ్యయనంలో హైదరాబాద్ నగరానికి ఈ ర్యాంక్స్ ఇచ్చింది. ఈ సర్వే నివేదికను ఈ సంస్థ సీఈఓ అనిల్ నాయర్ విడుదల చేశారు. పట్టణ చట్టాలు, విధానాలు, నిబంధనలు, ప్రభుత్వ నివేదికలు, బడ్జెట్ లను పరిగణన లోకి తీసుకుని 21 పట్టణాలకు వివిధ విభాగాల్లో ర్యాంక్స్ ప్రకటించారు. పూర్తి స్థాయిలో తిరువనంతపురం మొదటి రాంక్ సాధించింది. పూణే, కొలకత్తా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

Send a Comment

Your email address will not be published.