అడిలైడ్ లో ఎస్పీ గాన విభావరి

ఈ నెల 4 వ తేదీన అడిలైడ్ నగరంలో శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మరియు ఎస్ పి శైలజ గార్లు నిర్వహించిన గాన విభావరి “కలయాల” అధ్వర్యంలో  ఎంతో వైభవంగా జరిగింది.  ఈ కార్యక్రమం లో ప్రముఖ భారతీయ భాషలు మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ గానత్రయం చాలా చక్కటి గీతాలనాలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.  జాతీయ సమైక్యతకు మారు పేరుగా ఈ కార్యక్రమం భారతీయులందరి కోసం నిర్వహించినట్లు “కలయాల” ప్రతినిధి శ్రీ రమేష్ చెప్పారు.  అన్ని భాషల్లోనూ బహుళ ప్రచారంలో వున్న మంచి పాటలను పాడి కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది.

Send a Comment

Your email address will not be published.