అడిలైడ్ లో సంక్రాంతి రిపబ్లిక్ డే

అడిలైడ్ లో సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం సంక్రాంతి, రిపబ్లిక్ డే సంబరాలు ఎంతో ఉత్సాహంగా ముఖ్యంగా తెలుగు దనం ఉట్టి పడేలా జరుపుకున్నారు.  ముగ్గుల పోటీలు, పరుగు పందేలు, టగ్-అఫ్-వార్ మొదలైన ఆటల పోటీలతో పాటు అక్కడికి వచ్చిన పిల్లలందరితో  తెలుగులో ఏదో ఒక కధ, లేకపోతే వాళ్ళ అమ్మ, నాన్నల గురించి, ఇంట్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పించి ఒక వినూత్నమైన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

పలకరింపుతోనే పులకరింప జేసే తీయదనం
తెలుగు భాష యందున్న కమ్మదనం
శతాబ్దాల సంస్కృతి గల ఈ చరితము
తెలుగు జాతికే గర్వ కారణం

ప్రతీ తల్లి దండ్రి ఏ కారణం చేతనైనా ఆస్ట్రేలియా దేశం వచ్చి ఉండవచ్చు, కానీ మన భాష, సంస్కృతి మన పిల్లలకు ఏదో ఒక రూపంలో అందించి ఈ ప్రవాహాన్ని కొనసాగించాలన్న భావన మాత్రం అందరిలోనూ నిగూడంగా వుందనేది నిర్వివాదామ్శం.  ఈ అపురూపమైన భాషా సౌందర్య లహరి తెలుగు బడి రూపంలో ఒక కార్యాచరణ పధకంగా అమలుజేసి ఈ చిన్నారులకు మన అక్షర సుమాలు అందజేయగలిగితే మరింత బాగుంటుంది.  తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఆదిరెడ్డి గారు ఈ దిశగా పయనిస్తున్నట్లు తెలిపారు.

సంక్రాంతి సందర్భంగా ముగ్గులు, గొబ్బెమ్మలు, డూ డూ బసవన్నలు, సన్నాయి మేళాలు, భోగి మంటలు, కనుము కుడుములు, పతంగుల ఎగురవేత  ఇలా ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతీ జిల్లాల్లో వివిధ రకాలుగా పండగ సంబరాలు జరుపుకోవడం ఒక సనాతన ధర్మం మరియు ఆనవాయితీ కూడాను.  అయితే పర సంస్కృతితో సహజీవనం చేస్తూ అన్ని ఆచార వ్యవహారాలను ఆచరించడం అంత సులువైన పని కాదు.  ఉన్నంతలో మనది అనే ఒక ఉత్కృష్టమైన సంస్కృతిని ముగ్గుల రూపంలో కన్నులపండువుగా అమ్మలక్కలందరూ పాల్గొని ఎంతో నేర్పుతో వారి నిపుణతను ప్రదర్శించి చాలా అందమైన ముగ్గులు వేయడం అభినందనీయం.  ఈ సంస్కృతి మన ఆంధ్ర ప్రదేశ్ లోనే ఇప్పుడు లేదు.  ఈ ముగ్గుల పోటీలో తిరుమలదేవి గారికి ప్రధమ బహుమతి, రీనా కు రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి అనూరధకు లభించాయి.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడ పడుచులందరికీ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఆదిరెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా అన్ని వయసుల వారికి పరుగుల పోటీలు, మ్యూసికల్ చైర్స్, మరియు టగ్-అఫ్-వార్ పోటీలు కూడా నిర్వహించారు.
ఈ పోటీల్లో బహుమతులందుకొన్న వారి వివరాలు:

(1)   Running:
Under 13:
1 st prize: Guna
2 nd Prize: Sanjana
Under 10:
1 st prize: Krishan
2 nd prize: Kash
Under 4:
1 st Prize: Sneha
2 nd Prize: Ishanth
Ladies:
1 st Prize: Archana Reddy
2 nd Prize: Vijaya
(2)   Musical Chairs:
Under 13:
1 st prize: Keerthi
2 nd prize: Guna
Under 5:
1 st prize: Gnana
2 nd prize: Sneha
(3)   Tug- Of – War:
Naveena
Pranay Reddy
Ishanth

పైనుదహరించిన వారందరికీ బహుమతులు డాక్టర్ మోహన రావు గారు మరియు భారత దేశం నుండి వచ్చిన తలిదండ్రులు ద్వారా అందజేయడం జరిగింది. మరికొన్ని ఫోటోలు ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
https://picasaweb.google.com/adireddy.2000/TasaSankranthi2014Photos#

Send a Comment

Your email address will not be published.