అడిలైడ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

13962834_510637625796778_7564757262884106887_o
14053710_510639412463266_3477342776294087167_o
13913770_510639239129950_1542821977305204372_o

షుమారు రెండు శతాబ్దాలు బ్రిటిష్ వారి ఉక్కు పాదానికి అట్టుడికి జాతిపిత మహాత్మా గాంధీ మరియు ఎందరో మహానుభావుల త్యాగనిరతికి ఫలితంగా భారతావని ఆగష్టు 15, 1947వ సంవత్సరం స్వాతంత్ర్యం సాధించింది. భారత దేశంలో వాడ వాడలా ఈ కార్యక్రమం ఎంతో నిబద్ధతతో గడపడం మనమంతా చూస్తున్నాం. ఆస్ట్రేలియాలోని అన్ని ముఖ్య పట్టణాల్లో ఈ కార్యక్రమం భారత హై కమిషన్ అధ్వర్యంలో ఎంతో ప్రాభవంగా జరిగింది.

అడిలైడ్ నగరంలో మహాత్ముని సాక్షిగా IAASA (Indian Australian Association of South Australia) 50 ఏళ్ల సందర్భంగా మొదటిసారి శ్రీ ఆదిరెడ్డి యారా గారి అధ్యక్షతన  మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినాన్ని ఘనంగా జరుపుకున్నారు. గమనించవలసిన విషయం: IAASA 50 ఏళ్ల చరిత్రలో  శ్రీ ఆదిరెడ్డి గారు మొదటి తెలుగువారు కావడం తెలుగువారందరికీ గర్వకారణం.  ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 600 పైగా భారత సంతతికి చెందిన సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.

13975455_510637722463435_5908140970569300559_o
13958091_510639839129890_4808423001109476896_o
ఈ కార్యక్రమానికి His Excellency Hon. Hieu Van Le Governor of SA, Hon. Zoe Bettison Minister for multicultural affairs, Hon. Steven Marshall Leader of the Opposition మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. భారత దేశం నుండి పార్లమెంట్ సభ్యులు శ్రీ పసునూరి దయాకర్ మరియు తెలంగాణా రాష్ట్ర శాసన సభ సభ్యులు శ్రీ ధర్మారెడ్డి (వరంగల్) గార్లు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియా అవార్డు అందుకున్న శ్రీ మల్లికా ప్రసాద్ గారిని మరియు గవర్నర్ మల్టీ-కల్చరల్ అవార్డు గెలుచుకున్న సీమ శ్రీకుమార్ గారిని అడిలైడ్ గవర్నర్ సత్కరించడం జరిగింది.
పదవీ విరమణ చేసిన భారతీయ ఆర్మీ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ముదావహం.
13938285_510637529130121_1392160911247674198_o

Send a Comment

Your email address will not be published.