అనూహ్యమైన దుర్ఘటన

గత ఆదివారం పెర్త్ నగరంలో జరిగిన దుర్ఘటన మన తెలుగువారినే కాకుండా ఏవత్ ఆస్ట్రేలియా దేశంలోని భారతీయులతో సహా స్థానికులను కూడా దిగ్భ్రమలోకి ముంచింది. ఇదొక అనూహ్యమైన సంఘటన. ఇప్పుడిప్పుడే జీవితంలో మొదటి అడుగులు వేస్తూ ఊహల ఉయ్యాలలో రంగుల హరివిల్లు దిద్దుకుంటూ వున్న సమయంలో రెండు నిండు జీవితాలు లిప్త కాలంలో గాలిలో కలిసి పోవడం, మరో మూడు జీవితాలు జీవన్మరణంలో పోరాడుతుండటం అందరినీ దిగ్భ్రాంతికి లోను చేసింది.

ఐదుగురు విద్యార్ధులు యాంచేప్ నుండి పెర్త్ నగరం తిరిగి వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో శేషగిరి మేడవరపు మరియు అరవింద్ సామల మృతి చెందారు. నిషిద (అరవింద్ సతీమణి), నిశాంత్ దార, ప్రియదర్శిని (నిశాంత్ సతీమణి) తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరు ముగ్గురూ పెర్త్ రాయల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు శవ పంచనామా పూర్తి చేసి ఫ్యునరల్ ఏజెన్సీ కి అప్పజెప్పడానికి సిద్ధం చేస్తున్నారు.

పెర్త్ తెలుగు సంఘం (పెర్త్ తెలుగువారు) స్తానిక భారతీయ హై కమిషన్ మరియు కాన్బెర్రా హై కమిషన్ తో కలిసి పార్థివ దేహాలు తిరిగి భారత దేశం పంపడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికోసం అయ్యే ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం అందివ్వవలసిందిగా అందరినీ కోరుతున్నారు. ఇప్పటికే చాలామంది వాట్సప్ లోనూ మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తమవంతు సహాయం అందించారు. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ఈ ఆపద సమయంలో మీ సహాయం ఎంతో అవశ్యం. మీకు వీలైనంత ఈ క్రింది బ్యాంకు ఎకౌంటు లో జమ చేసి ఆదుకోవాలని అభ్యర్ధన. ఈ విషయం తెలిసి ఇప్పటికే మీరు సహాయం అందించుంటారు. అయితే మీకు తెలిసిన వారికి ఈ విషయం తెలిపి వారు కూడా సహాయం చేయడానికి తోడ్పడవలసిందిగా మనవి.

ACC Name: Western Australia Telugu Association Inc.
BSB NO: 066 000
ACC No: 1149 2361
Description: Arvind and Seshu

గమనిక: తాజా సమాచారం ప్రకారం పార్ధివ దేహాలు ఎమిరేట్ విమానంలో పార్ధివ దేహాలు భారత దేశానికీ వెళ్ళే ఏర్పాట్లు చేయడం జరిగింది.  ఇప్పటి వరకు షుమారు $ 33, 000.00 జమ కూడినట్లు  వాటా అధ్యక్షులు శ్రీ శ్యాం అంబటి తెలిపారు.  వైద్య శాలలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితుల తలిదండ్రుల కోసం వీసాలు ఏర్పాట్లు చేసి వారు పెర్త్ నగరాన్ని సందర్శించడానికి తగు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Send a Comment

Your email address will not be published.