అన్నయ్యతో విభేదాలు లేవు

అన్నయ్య చిరంజీవితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు . పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి మార్చ్ 2 వ తేదీ రాత్రి ఒక పత్రికా ప్రకటన వెలువడింది .

పవన్ కళ్యాణ్ త్వరలోనే రాజకీయాలలోకి వస్తారని, పార్టీ పెడతారని, కాదు కాదు ఇప్పటికే ఉన్న ఒక రాజకీయ పార్టీలో చేరుతారని ఇలా రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. వాటికి జవాబిచ్చే విధంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.

అందరూ అనుకుంటున్నట్టు తనకు అన్నయ్య చిరంజీవితో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని ఆయన అన్నారు. రాజకీయాలపై తనకున్న ఆలోచనలను, పార్టీ, అలాగే ఎన్నికలలో పోటీ చెయ్యాలా వద్దా అనే ఇతరత్రా వివరాలను తానే స్వయంగా ఈ నెల రెండో వారంలో వెల్లడిస్తానని పవన్ తెలిపారు.

ఇలా ఉండగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో హృదయ స్పందన ఫౌండేషన్ ఆద్వర్యం లో జరిగిన హార్ట్ వాక్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వ్యాయాయం చెయ్యాలన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆలోచనలు అవసరమని, ఆలోచనలు మంచివైతే సమాజానికి అవి ఎంతో తోడ్పడతాయని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు బిజీ రాజకీయాలు జరుపుతున్నారని, దాంతో చిన్న పిల్లలకు సరైన వైద్యం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులపై హృదయ స్పందన ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ముదావహమని ఆయన చెప్పారు. హార్ట్ వాక్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,పోలీస్ ఉన్నతాదికారి అనురాగ్ శర్మ, కళాశాల విద్యార్ధులు, వైద్యులు  తదితరులు పాల్గొన్నారు.

Send a Comment

Your email address will not be published.