అన్ని జాగర్తలూ తీసుకున్నాం

పవన్ కళ్యాన్, వెంకటేష్ కలిసి నటించిన గోపాలా గోపాలా సినిమా విషయంలో తాము అని జాగర్తలూ తీసుకున్నామని ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తెలిప్పారు.

గోపాలా గోపాలా సినిమాను క్లియర్ చేసేటప్పుడు ఒక్కసారి పూర్తిగా పరిశీలించమని కొన్ని హిందువుల సంస్థలు ప్రాంతీయ చలన చిత్ర బోర్డు వద్దకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సురేష్ బాబు మాట్లాడుతూ తాము ఈ చిత్ర నిర్మాణంలో ఆచి తూచి  వ్యవహరించామని చెప్పారు. కొన్ని  హిందువుల సంస్థలు కొన్ని సన్నివేశాలు, కొన్ని సంభాషణల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ చిత్ర నిర్మాతలు ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగర్తలు తీసుకున్నారని సురేష్ బాబు చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో  సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.

తాము నిర్మించిన ఈ చిత్రానికి, ఇటీవల హిందీలో విడుదల అయిన పీ కె సినిమాకు తేడా ఉందని, తమ సినిమాలో భగవంతుడు ఉన్నాడని ఆయన చెప్పారు. దేవుడుని ఎలా ప్రేమించాలి భయపడకూదన్నది ఈ సినిమా చెప్తుందని అన్నారు. కనుక ఈ విషయంలో ఎలాంటి  వివాదాలు తలెత్తవనే అనుకుంటున్నామని చెప్పారు.

ఈ సినిమాలో ఒకడు  దేవుడిపై దావా వేస్తాడని, అప్పుడు ఆ దేవుడు భూలోకానికి దిగి వస్తాడని, దావా వేసిన వ్యక్తిని సన్మార్గంలో పెడతాడని సురేష్ బాబు చెప్పారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ నడిపే ద్విచక్ర వాహనంపై ఉన్న నెంబర్ ఓం  786 గురించి మాట్లాడుతూ ఆ నెంబర్ ని ఒరిజినల్ హిందీ చిత్రం నుంచి తీసుకున్నామని, ఆ నెంబర్ ప్లేట్ మీద మూడు చిహ్నాలు ఉంటాయని అన్నారు.

వినాయకుడు హెల్మెట్ పెట్టుకున్న విషయం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేసారని, కానీ వినాయక చవితి పండగప్పుడు జనం మధ్యలో ఎన్ని రకాల వేషధారణలో వినాయకుడి బొమ్మలు చూస్తున్నామో వేరేగా చెప్పకర్లేదని, కొన్ని వినాయకుడి బొమ్మలు క్రికెట్ బ్యాక్డ్రాప్ లో తయారు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. కనుక ఆయన తమ సినిమాలో వినాయకుడు హెల్మెట్ ధరించడాన్ని సమర్ధించుకున్నారు.

Send a Comment

Your email address will not be published.