అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒక వినూత్న పద్ధతిని ఎంచుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయించుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని ఈ పార్టీ భావిస్తోంది. ఐ.వి.ఆర్ పద్ధతిని ఉపగించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు పేర్లు రాసి అందరికీ ఎస్.ఎం.ఎస్ సందేశాలను పంపిస్తారు. ఈ సందేశాలను కూడా ఎక్కువగా గ్రామీణులకే పంపిస్తారు. ఈ నాలుగు పేర్లలో ఒక పేరును ఎంపిక చేయాల్సిందిగా సూచిస్తారు. ఈ నలుగురు అభ్యర్థులనూ తిరస్కరించడానికి కూడా ఇందులో అవకాశం కల్పిస్తారు. హై టెక్ పద్ధతి ద్వారా అభ్యర్థులపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడం కూడా జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.