అమరావతిలో రాజధాని

రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి తాజాగా గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమయిన అమరావతి మీద పడినట్టు కనిపిస్తోంది. బౌద్ధ స్థూపం, బౌద్ధ పురావస్తు ప్రదర్శనసాల ఉన్న అమరావతి గుంటూరుకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజధాని విషయంలో ఆయన దృష్టి మొదటి నుంచీ కృష్ణ, గుంటూరు జిల్లాల చుట్టే తిరుగుతోంది.

అమరావతిలో పది వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉండడం, పైగా ఆ పట్టణం ఒక నది ఒడ్డున ఉండడం అనుకూల అంశాలని ఆయన భావిస్తున్నారు. ఆయన ఇంతకుముందు కృష్ణ, గుంటూరు నగరాల మధ్య (నంబూరు దగ్గర) రాజధానిని ఏర్పాటు చేయాలని భావించారు కానీ, అక్కడి స్థలాల ధరలు కోట్లు దాటిపోవడంతో ఆయన పునరాలోచన చేస్తున్నారు. అమరావతి ప్రతిపాదనతో త్వరలో ప్రధానిని కలవాలని ఆయన భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.