అమితాబ్ కి అక్కినేని అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు అక్కినేని జాతీయ పురస్కారాన్ని
ప్రదానం చేశారు. ప్రతి ఏటా ప్రముఖ నటులకు ప్రదానం చేసే ఈ ప్రతిష్టాత్మక
పురస్కారానికి ఈ ఏడాది అమితాబ్ ను ఎంపిక చేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి
కె. చంద్రశేఖర్ రావు ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. పురస్కారంలో
భాగంగా ఒక జ్ఞాపికను, అయిదు లక్షల రూపాయల నగదును అందజేశారు. కేంద్రమంత్రి
ఎం. వెంకయ్య నాయుడు ఆయనకు శాలువా కప్పి ప్రశంసా అందజేశారు. "అక్కినేని
పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో ఎన్నో అపురూప క్షణాలను
గడిపాను. ఆయన ఎంతో నిరాడంబరుడు. సమాజం ఆదరించడం వల్లే ఈ స్థానంలో
ఉన్నామని, కాబట్టి సమాజానికి వీలయినంత సహాయం చేయాలని ఆయన భావించాడు. ఆ
మాటలు నాకెంతో స్ఫూర్తిని ఇచ్చాయి" అని అమితాబ్ అన్నారు. ఆ తరువాత
ముఖ్యమంత్రిని ఉద్దేశించి, "నా ఫేస్, నా వర్క్ మీకు ఉపయోగపడతాయని
ఎప్పుడయినా భావిస్తే తప్పక సంప్రతించండి" అని ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.