అమిత్ షాతో పవన్ భేటీ

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు అయిన పవన్ కళ్యాన్ గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో భేటీ అయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన షాతో ఆయన అరగంటకు పైగానే చర్చలు జరిపారు. త్వరలో హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపైనే ఈ ఇద్దరు చర్చలు జరిపినట్టు తెలిసింది.సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ, తెలుగుదేశం పార్టీలు గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయాలని, ఈ సారి కూడా పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకోవాలని భావిస్తున్నాయి. ఈ మూడు పార్టీలూ కలిసి పనిచేస్తే మజ్లిస్, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలను సమర్థంగా ఎదుర్కోవచ్చని అవి ఆలోచిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.