అమీర్ ఖాన్ ప్రచార పర్వం

సామాన్యులలో ఓటు పై అవగాహన పెంచేందుకు భారత ఎన్నికల సంఘం బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ను ప్రచార కార్యక్రమానికి నియమించింది.
ప్రజా సమస్యలపై ఇప్పటికే అనేక రూపాల్లో పోరాటం చేసిన అమీర్ ఖాన్ 2006 లో నర్మదా బచావో ఆందోళనలో పాల్గొన్నాడు.
జనలోక్ పాల్ బిల్లు కోసం ఉద్యమించిన అన్నా హజారేకు మద్దతిచ్చిన అమీర్ ఖాన్ తన  దృష్టి అంతా దేశంలోని పిల్లల చదువు, పోషకాహారాల మీదే ఉందన్నాడు.
తాను నటించిన త్రీ ఇడియట్స్ సినిమా ప్రమోషన్ కోసం దేశంలోని అనేక గ్రామాల్లో పర్యటించారు.
2011 లో పిల్లల పోషకాహారం పై చైతన్యం తీసుకొచ్చేందుకు యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యాడు కూడా. పోషకాహారం పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచార కార్యక్రమాలలో పాలుపంచుకున్న అమీర్ 1986 లో రీనా దత్తాను పెళ్ళాడాడు. 2001 వరకు ఆమెతో కలిసున్నాడు. 2005 లో కిరణ్ రావుని వివాహమాడాడు. తనకు ఆంగ్ల సినిమా దర్శకుడు నిర్మాత ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఆదర్శమని చెప్పుకునే అమీర్ ఖాన్ మీడియా ప్రచారాన్ని ఇష్టపడడు.
మేడం తుస్సాడ్ మూజియం లో తన మైనం బొమ్మ పెట్టడానికి అనుమతించని అమీర్ సినిమాల ద్వారా తనను గుర్తుపెట్టుకుంటే చాలన్నాడు.
2003 లో పద్మశ్రీ పొందిన అమీర్ ఇప్పుడు సత్యమేవ జయతే టీ వీ కార్యక్రమంలో సామాజిక సమస్యలపై ఉతికి ఆరేస్తున్నాడు.

Send a Comment

Your email address will not be published.