అమెజాన్ అడ్డాగా తెలంగాణా

అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో అతి పెద్ద గోదామును ప్రారంభించింది. దీన్ని ఫుల్ ఫిల్ సెంటర్ అని వ్యవహరిస్తారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో మరో పెద్ద గోదామును ప్రారంభించబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు ప్రభుత్వం స్థానిక నానక్ రామ్ గుడా లో ఇందుకు పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

అమెరికా వెలుపల అమెజాన్ సంస్థకు ఉన్న అతి పెద్ద గోదాము ఇదే కాబోతోంది.

నిర్మల్ బొమ్మలు, గద్వాల, పోచంపల్లి చీరేలతో పాటు, తెలంగాణాలోని వివిధ రకాల హస్తకళ ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా విక్రయించేందుకు అమెజాన్ సంస్థతో కలిసి ఒక ఈ కామర్స్ వెబ్ సైట్ ను త్వరలో ప్రారంభిస్తామని తెలంగాణా ఐ.టి శాఖ మంత్రి కె. తారక రామా రావు ప్రకటించారు. దీనివల్ల తెలంగాణా ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుత్యం లభిస్తుందని ఆయన చెప్పారు. అమెజాన్ సంస్థకు దేశంలో ఇది (కొత్తూరు గోదాము) 11వ గోదాము.

చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల ఉత్పత్తులకు కూడా అమెజాన్ గోదాము వల్ల గిరాకీ లభిస్తుందని ఆశిస్తున్నారు. ఇది ఇలా వుండగా, ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 37 ఐ.టి కంపెనీలు తమ సంస్థలు ప్రారంభించబోతున్నాయని, ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయని ఆంధ్ర ప్రదేశ్ ఐ.టి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ప్రకటించారు. ఇవన్నీ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతున్నాయి.

Send a Comment

Your email address will not be published.