అమ్మ సినిమా

తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కటకటాలపాలవడంతో ఆమె పేరిట తీస్తున్న “అమ్మ” సినిమాలో క్లైమాక్స్ లో మార్పులు తప్పలేదు.

ఫైసల్ సైఫ్ దర్శకత్వం వహిస్తున్న అమ్మ సినిమాలో రాగిణి ద్వివేది ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని అయిదు భాషల్లో తీస్తున్నారు. హిందీలో రాగిణి నటిస్తున్న మొదటి సినిమా ఇది.

ఓ యువతీ సినీ పరిశ్రమలో చేరి రాత్రికి రాత్రి స్టార్ అయిపోయి ఆ వెంటనే రాజకీయాలలోకి అడుగుపెట్టడం కథాంశంగా అమ్మ సినిమా నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో రాజ్ పాల్ యాదవ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా రాగిణి మాట్లాడుతూ ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో కీలకమైనదని, తనకీ పాత్ర ఒక సవాల్ అని చెప్పారు. జయలలిత గారి బాడీ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకుని ఈ చిత్రంలో నటించానని అన్నారు. అయినా కథంతా ఆమెను దృష్టిలో పెట్టుకుని చేసినప్పటికీ ఆమె జీవితానికి  ఈ చిత్రం ఎంత వరకు అద్దం పడుతుందో చెప్పలేనని అన్నారు. ప్రస్తుతం జయలలిత గారు జైలుపాలవడంతో క్లైమాక్స్ లో కొన్ని మార్పులు తప్పలేదని చెప్పారు. క్లైమాక్ల్స్ ని దర్శకుడు మార్చి  రాస్తున్నారని, అది ఎలా ముగించాలో ఆయన చేతిలో ఉందని చెప్పారు. జయలలిత జీవితంలో సన్నిహితురాలు అయిన శశికళ, కీర్తిశేషులు ఎం జీ రామచంద్రన్ పాత్రలను కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. సినిమా అంతా చూసే వారికి ఆశ్చర్యకరంగా ఉంటుందని. అది ఇప్పుడే చెప్పడం భావ్యం కాదని రాగిణి తెలిపారు.

ప్రస్తుతం  తమిళనాడులో రాజకీయ పరిణామాల్లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా మనోజ్ బాజ్ పాయిని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారని దర్శకుడు సైఫ్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.