'ఆంధ్ర'కే హీరో

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తొలి భారీ పరిశ్రమను సాధించింది. దక్షిణాదిలో తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఆంద్ర, తెలంగాణాల మధ్య ఊగిసలాడిన హీరో మోటార్స్ సంస్థ చివరికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్నే ఎంచుకుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. హీరో ద్విచక్ర వాహన సంస్థకు చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ సమీపంలో 600 ఎకరాలు కేటాయించనున్నారు. ఈ సంస్థ ప్రతినిధులు ఒకటి రెండు రోజుల్లో నగరానికి వస్తున్నారు. ఈ విషయాలను చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. “ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో కొత్త రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమను అయినా తీసుకు రావాలనుకున్నాను. తీసుకు రాగలిగాను” అని ఆయన అన్నారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమ ఉత్పత్తి సంస్థను ప్రారంభించడానికి హీరో అంగీకరించిందని ఆయన చెప్పారు. ఈ సంస్థ వల్ల మూడు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.