ఆంధ్రాలో ఐ టీ జోరు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడలో ఏడు ఐ టీ కంపెనీలకు రాష్ట్ర ఐ.టీ మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో ఇటీవలే 22 ఐ.టీ కంపెనీలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఎలెర్న్, సుప్రీమ్ నెట్ సాఫ్ట్, క్రేసోల్ ఇన్ఫో సర్వ్, డీ ఆర్ కంప్యూటర్స్, ఇన్స్పైర్ లాబ్స్, ఎంవీరా, స్టీమ్డ్ ఇంటిగ్రేటెడ్ సోలుషన్స్ సంస్థలు ఇక్కడ కొత్తగా తమ శాఖలను ప్రారంభించాయి. వీటి ప్రారంభోత్సవం సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా త్వరలో డ్రోన్ల పరిశ్రమ ప్రారంభం కాబోతోందని తెలిపారు. కొత్త సంస్థల ద్వారా సుమారు మూడు వందల మందికి ఉపాధి లభించబోతోందని ఆయన చెప్పారు. విశాఖలో కూడా మరిన్ని ఐ.టీ సంస్థలు రాబోతున్నాయని ఆయన తెలియజేసారు. దక్షిణాసియాలోని అత్యంత పెద్దదయిన డేటా సెంటర్ విశాఖకు రానుందని ఆయన చెప్పారు. విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద వంద ఎకరాల్లో ఐ.టీ క్లస్టర్ వస్తోందని కూడా ఆయన వెల్లడించారు. సంప్రదాయ ఐ.టీ సంస్థలతో పాటు, క్లౌడ్ ఆధారిత ఐ.టీ పరిశ్రమలు కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయని లోకేష్ తెలిపారు.

Send a Comment

Your email address will not be published.