ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మహర్దశ

Celkon-S1నెల్లూరు, తిరుపతి, చెన్నైల మధ్య అతి త్వరలో ప్రపంచంలోనే అతి పెద్ద హార్డ్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రూపుదిద్దుకోనుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలో నిర్మించిన సెల్ కాన్ మొబైల్ తయారీ పరిశ్రమకు ఆయన ప్రారంభోత్సవం చేస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ సెల్ కాన్ పరిశ్రమ ద్వారా వందలాది స్థానికులకు, నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో ఇంతవరకూ 1569 ఒప్పందాలు కుదుర్చుకుందని, ఒకటి రెండేళ్లలో ఇవి అమలు కానున్నాయని ఆయన తెలియజేసారు. ఇవి కనుక అమలయితే రాష్ట్రానికి రూ. 16,087 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు. నెలకు పది లక్షల మొబైల్ ఫోన్లు తయారు చేయడం లక్ష్యంగా సెల్ కాన్ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని సంస్థ అధిపతి గురుస్వామి నాయుడు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.