ఆక్లాండ్ లో సిలికానాంధ్ర మనబడి

ఆక్లాండ్ లో సిలికానాంధ్ర మనబడి

న్యూ జిలాండ్ తెలుగు సంఘం అధ్వర్యంలో సిలికానాంధ్ర సౌజన్యంతో మన బడి ఈ నెల 9 వ తేదీన షుమారు 14 మంది పిల్లలతో ప్రారంభించబడింది.  మన పిల్లలకు తెలుగు అక్షర సుమాలు అందివ్వాలన్న తపన, ఆకాంక్ష ఎంతో ఉత్కృష్టమైన ఆశయం.  పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన సంస్కృతినీ భాషనీ కాపాడుకోవాలనే తలంపు ఒక మహోన్నతమైన జాతిని నిలబెట్టడమే.  కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గలిగిన మన భాషా సంస్కృతులు భావి తరాలకు అందివ్వగలిగితే అంతకన్నా ఇవ్వగలిగే సిరి సంపదలు వేరే ఏమీ ఉండవు.

ఈ కార్యక్రమానికి చేయూతనిస్తూ తమ వంతు కృషి చేస్తున్న శ్రీ సీతారాం సల్వజి గారికి మరియు ఇతర సభ్యులకు తెలుగు సంఘం కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.  తెలుగుమల్లి తరఫున ఈ బడిలో చేరిన ప్రతీ విద్యార్ధికి పెదబాల శిక్ష పుస్తకాన్ని ఉచితంగా అందజేయడం జరిగింది.  ఈ విద్యాభ్యాసము ద్వారా పిల్లలు వృద్ధి పొంది మరెందరికో స్పూర్తి నివ్వగలరని తెలుగుమల్లి ఆకాంక్షిస్తుంది.

Send a Comment

Your email address will not be published.