'ఆగడు' అచ్చంగా శ్రీను వైట్ల చిత్రం

ఆగడు చిత్రం అచ్చంగా శ్రీను వైట్ల ముద్ర వేసుకున్నదని ప్రిన్స్ మహేష్ బాబు చెప్పారు.

శ్రీను వైట్లతో తాను చేస్తున్న రెండో చిత్రమిది అని ఆయన అన్నారు. అంతకుముందు వీరి కలయికలో దూకుడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా…ఇప్పుడు నటిస్తున్న ఆగడు చిత్రం పూర్తిగా వినోదాత్మకమైనదని, తాను పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నానని మహేష్ బాబు చెప్పారు.

ఆగడు చిత్రంలో ఆయనకు జోడీగా తమన్నా నటిస్తోంది. ఆమె గురించి ఆయన మాట్లాడుతూ, తమన్నా అంకితభావంతో నటించే తార అని చెప్పారు. ఆమెతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవమని ఆయన అన్నారు. అందుకే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా నిరీక్షిస్తున్నాను అని మహేష్ బాబు తెలిపారు.

ఈ చిత్రం వచ్చే సెప్టంబర్ 19న  విడుదల కానుంది.

ఇటీవల ఆగడు చిత్రం కోసం లెహ్ – లడఖ్ లో ఒక పాట చిత్రీకరించారని, అక్కడ వర్క్ చెయ్యడం క్లిష్టమైనదని, భిన్నమైందని మహేష్ బాబు చెప్పారు. మా  చిత్ర యూనిట్ మొత్తం అక్కడ పని చెయ్యడంతో ఒక కొత్త అనుభాన్ని సంతరించుకుందని ఆయన అన్నారు.

ఈమధ్య ఆగడు చిత్రానికి సంబంధించి ఒక ట్రైలర్ వచ్చింది. అందులో ఒక డైలాగు చర్చనీయంగా మారింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అందులో ఉన్న మాటలు నా సొంతం కాదని, అవి క్యారక్టర్ పరంగా వాడిన మాటలని మహేష్ బాబు అన్నారు. అయితే దీనిపై ఎందుకంత చర్చ జరిగిందో తెలియడంలేదన్నారు. పైగా నా పూర్వ చిత్రం దూకుడులోని బబ్బర్ షేర్ మాటకు పంచ్ డైలాగుగా ఇప్పుడు ఈ ఆగడు ట్రైలర్ లో వాడినట్టు తెలిపారు. అంతే తప్ప ఎవరినీ ఉద్దేశించి చెప్పిన మాట కాదన్నారు.

సోనాక్షి సిన్హా, సొనమ్ కపూర్, దీపిక పదుకొనె తదితరులు  మహేష్ బాబుతో కలిసి నటించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ విషయాన్ని  ప్రస్తావిస్తూ వీళ్ళు గొప్ప యాక్టర్స్ అని, వారి వర్క్ తనకెంతో ఇష్టమని, ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ వస్తే చూస్తాను ఎవరితో నటించాలోనని మహేష్ బాబు అన్నారు.

క్యారక్టర్ లను బట్టి హీరొయిన్ ల ఎంపిక ఉంటుందని చెప్తూ ఎవరు సరిపోతారో  చూసుకుని వారిని ఎంపిక చెయ్యడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇక్కడ బాలీవుడ్ తారలా లేక టాలీవుడ్ తారలా అని తేడాలుండవని చెప్పారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో విశాఖపట్నానికి ఫిలిం ఇండస్ట్రీ మారిస్తే మంచిదని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు నో కామెంట్స్ అని మహేష్ బాబు జవాబిచ్చారు.

రీమేక్స్ గురించి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు తన కెరీర్ లో రీమేక్స్ చెయ్యలేదని ఆయన జవాబిచ్చారు. ఒకవేళ రీమేక్స్ చేస్తే ఒరిజినల్ లో ఉన్న ఎక్సైట్ మెంట్ రీమేక్ చిత్రంలో లోపించవచ్చన్నది ఆయన అభిప్రాయం. తానెప్పుడూ ఒరిజినల్  చిత్రాన్నే ప్రిఫెర్ చేస్తానని అన్నారు.

కొడుకు గౌతమ్ తో కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తారా అని అడగ్గా గౌతం కు నటించడం అంటే ఇష్టమే కానీ అది ఇంకొంత టైం పట్టవచ్చని మహేష్ బాబు చెప్పారు. ఇంతకూ అతను ఏ ఫీల్డ్  ఎంచుకుంటాడో అది వాడి ఇష్టమని అన్నారు.

కొడుకు గౌతం కాస్తంత నెర్వస్ గా ఫీల్ అవుతాడని, కానీ కూతురు సితార అలా కాదని, చిలిపి  అల్లరి చేస్తుందని మహేష్ బాబు ఒక ప్రశ్నకు నవ్వుతూ జవాబిచ్చారు.

మణిరత్నంతో  ఒక చిత్రానికి ప్లాన్ చేసిన మాటను ప్రస్తావిస్తూ అది కార్యరూపం దాలుస్తుందేమో చూడాలని, అయితే డేట్స్ దగ్గరే సమస్య అని చెప్పారు. ఎందుకంటె ప్రస్తుతం తాను రెండు చిత్రాలు చేస్తున్నానని, కనుక తేదీల వద్దే సమస్యంతా కేంద్రీక్రుతమైనట్టు మహేష్ బాబు చెప్పారు. అయితే ఆ ప్రాజెక్టు అవుతుందా అవదా అనేది ఇప్పటికిప్పుడు ఏదీ చెప్పలేమని, చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

తన మనసుకు నచ్చే చిత్రాలు చెయ్యడానికే ఇష్టపడతానని అంటూ ఒక సినిమా విజయవంతం కాకపోయినంత మాత్రాన దానినే తలచుకుంటూ కలత చెందడం సరికాదని, ఎక్కడ ఫెయిల్ అయ్యామో తెలుసుకుని మున్ముందు చిత్రాలలో ఆ లోపాలను అధిగమించడానికి ఆలోచిస్తానని మహేష్ బాబు అన్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడిన 1 – నేనొక్కడినే చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబు ఈ వ్యాఖ్యలు చేసారు.

ప్రస్తుతం ఆగడు సినిమా చేస్తున్నానని, దాని తర్వాత కోరట్ల శివకోసం ఒక సినిమా చేస్తానని, బహుశా ఆ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కావచ్చని మహేష్ బాబు చెప్పారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

 

 

 

 

 

 

 

Send a Comment

Your email address will not be published.