ఆగస్టు 12 నుంచే పుష్కరాలు

కృష్ణా పుష్కరాల ప్రారాంభానికి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పుష్కరాల సమయంపై వేద పండితులతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం ఆగస్టు 12 న సూర్యాదాయ సమయం నుంచే పుష్కరాలు ప్రారంభం కానున్నట్టు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది ప్రవహించే ప్రాంతాల్లో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి పుష్కర ప్రాంతాలను హెలికాఫ్టర్ లో పర్యవేక్షించారు. పుష్కర ఘాట్లు, వీ ఐ పి ఘాట్లను, వాటికి వెళ్లే దార్లను పరిశీలించారు. వివిధ జిల్లాల అధికార్లతో చర్చలు జరిపి, ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. పుష్కర ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దాదాపు 120 కోట్ల రూపాయలు మొదటి విడతగా ఖర్చు చేస్తోంది.

Send a Comment

Your email address will not be published.