ఆనంద గజపతి కన్నుమూత

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద్ గజపతి రాజు ఇక లేరు. ఆయన శని వారం సాయంత్రం విశాఖపట్నంలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఈ విజయనగర రాజ వంశీకుడు గత కొద్ది కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మరణించే సమయంలో ఆయన తమ్ముడు అశోక్ గజపతి రాజు ఆయన పక్కనే ఉన్నారు. ఆయనే ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహించారు. ఆనంద గజపతి రాజుకు భార్య సుధా తాయారు, కుమార్తె ఊర్మిళ ఉన్నారు. ఉత్తరాంధ్రలో విద్యల రాజుగా పేరున్న ఆనంద గజపతి రాజు విజయనగరంలో ఒక పెద్ద వైద్య కళాశాల నిర్మాణానికి విరాళాలు సేకరించే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. ఎన్టీఆర్  హయాంలో ఆయన విద్యామంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన విద్యా రంగంలో అనే సంస్కరణలు చేపట్టారు.

Send a Comment

Your email address will not be published.