ఆయారాం, గయారాం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన కావూరి సాంబశివ రావు బీజేపీలో చేరే ఉద్దేశంలో ఉన్నారు. ఆయన నిన్న ఢిల్లీ లో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. బహుసా ఈ నెల 31 లోగా అంటే ఉగాది లోగా ఆయన బీజేపీలో చేరిపోయే అవకాశం ఉంది. ఇది ఇలావుండగా మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ అయిన రాయపాటి సాంబశివ రావు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నిజానికి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరుతున్న నాయకులతో తెలుగుదేశం పార్టీ కిటకిటలాడిపోతోంది.  ఇక ఎవరూ పార్టీ టికెట్ల కోసం తమ పార్టీలో చేరవద్దని, బేషరతుగా చేరడానికయితే అభ్యంతరం లేదని ఆ పార్టీ నాయకత్వం తేల్చి చెప్పేసింది.

Send a Comment

Your email address will not be published.