ఆస్ట్రేలియాకు కె టీ ఆర్

తెలంగాణ రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు డిసెంబర్ 5వ తేదీన ఆస్ట్రేలియా వస్తున్నారు. ఆయన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం పాల్గొనడానికి రావాల్సిందిగా ఆయనకు ఆ దేశ ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ఈ మేరకు కె.టి.ఆర్ కు లేఖ రాశారు. ఈ రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు పడాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఇరు దేశాల నుంచి సుమారు యాభై మంది ప్రముఖ వ్యాపార, వాణిజ్యవేత్తలు, ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారులు, మేధావులు హాజరవుతున్నారు. తెలంగాణలో ఐ.టి రంగం, పారిశ్రామిక పెట్టుబడులు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలతో మంత్రి అక్కడ ప్రసంగిస్తారు.

Send a Comment

Your email address will not be published.