వచ్చే అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటినుండీ రాష్ట్ర పునరాభివ్రుద్ధికి సంబంధించి సింగపూర్, జపాన్, చైనా, టర్కీ మొదలైన దేశాల నేతలతోనూ, ప్రముఖ వ్యాపారవేత్తలతోనూ విస్తృతమైన చర్చలు జరిపి క్రొత్త రాజధాని నగర నిర్మాణానికి, పరిశ్రమల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారు. మధ్యలో హూదుద్ తుఫాను వచ్చి విశాఖపట్నం నగరాన్ని అతలాకుతలం చేసినా రాష్త్ర పునఃర్వ్యవస్తీకరణీ లక్ష్యంగా ధైర్యంతో ముందుకు సాగుతున్నారు.
ఈ దిశగా ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడి ప్రభుత్వాన్ని కూడా సహాయం అర్దించే అవకాశం వుంది. గత జనవరి నెలలో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి శ్రీ ఆండ్రూ రాబ్ షుమారు 450 మంది (భారత దేశానికి వెళ్ళిన అతిపెద్ద ప్రతినిధివర్గం) భారత దేశం వెళ్ళినపుడు శ్రీ చంద్రబాబు నాయుడు ఆస్ట్రేలియా రావడానికి సుముఖత వ్యక్తం చేసారు.
భారత దేశం | ఆస్ట్రేలియా | ఆంధ్ర ప్రదేశ్ | |
భూవైశాల్యం | 3.288 million Sq.Kms | 7.692 million Sq.Kms | 0.16 million Sq.Kms |
జనాభా | 1.25 billion | 24 million | 50 million |
తీర ప్రాంతం | 7517 kms | 7500 kms | 974 kms |
పట్టణ ప్రాంతాలు | 31% | 89% | |
జి.డి.పి | 1.8 trillion | 1.5 trillion |
ఆస్ట్రేలియా భారతదేశాల మధ్య కొన్ని విషయాల పోలిక
భారతదేశం తక్కువ భూవైశాల్యం కలిగివుండి ఎక్కువ జనాభాతో వుంది. ఆస్ట్రేలియా ఇందుకు విరుద్ధంగా వుంది. జనాభా, భూవైశల్యాలను పోలిస్తే ఈ రెండు దేశాలు వాణిజ్య వ్యాపార సంబంధాలు విస్తృతంగా కలిగివుంటే ఎంతో లాభపడే అవకాశం వుంది.
ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్నపుడు శ్రీ చంద్రబాబు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వుండి ఆంధ్ర ప్రదేశ్ ని ఐటి కేంద్రంగా ప్రపంచ పటంపై కెక్కించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో వున్న షుమారు 500 000 మంది భారతీయుల్లో 100 000 మంది తెలుగువారున్నారు. ఇందులో సింహ భాగం ఐటిలో పని చేస్తున్నారు. బ్రిటిష్ వారి పుణ్యమా అని ఇతర దేశాల వారికంటే మనవాళ్ళు ఆంగ్ల భాషని అనర్గళంగా మాట్లాడే స్థితిలో వుండడం ఒక ప్రయోజనం.
ఆస్ట్రేలియా – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిధిలో వాణిజ్య వ్యాపారాలు చేయగోరితే ఈ క్రింద నుదహరించిన రంగాలలో ఎక్కువ అవకాశాలున్నాయి.
- విద్య
- ఆరోగ్యం
- మత్స్య పరిశ్రమ
- మైనింగ్
- ఐటి
- వ్యవసాయం
- మౌళిక సదుపాయాలు
- సాంఘిక అభివృద్ధి
- పర్యాటక రంగం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యాపార నిమిత్తం ఎవరైనా ఒక దరఖాస్తు పెడితే 21 రోజుల్లో వారికి తగిన అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్రీ చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.
క్రొత్త ఎయిర్ పోర్టులు, తీర ప్రాంతాలలో క్రొత్త పోర్టులు, రహదార్లు, పవర్ గ్రిడ్లు, గ్యాస్ గ్రిడ్లు ఇలా ఎన్నో రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వ్యాపారవేత్తలను శ్రీ చంద్రబాబు ఆహ్వానించే అవకాశం వుంది. ఇరు దేశాల ప్రధానుల పర్యటనల తదుపరి శ్రీ మోడీ ప్రభుత్వం తరఫున రెండు పార్లమెంటరీ ప్రతినిధి వర్గాలు ఆస్ట్రేలియా రావడంవ జరిఇంది. ఇప్పుడు చంద్రబాబు వస్తే ఆస్ట్రేలియా భారత దేశాల సంబంధాలలో మరో మైలు రాయికి శుభారంభమని చెప్పవచ్చు.