ఆస్ట్రేలియాకు బంగినపల్లి

Mangoఈ నెల మొదటి వారంలో ఆస్ట్రేలియా దేశానికి భారీగా మామిడి పళ్ళు ఎగుమతి చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మామిడి పళ్ళు విజయవాడ నుంచి ఆ దేశానికి తరలబోతున్నాయి. ఈ మామిడి పళ్లలో అధిక భాగం బంగిన పళ్లేనని, ఆస్ట్రేలియాలో బంగినపల్లి పండ్లపై మక్కువ ఎక్కువని రాష్ట్ర మామిడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఎం. విశ్వేశ్వర రావు తెలిపారు. ఈ పండ్లను ఎగుమతి చేసుకునే ముందు ఆస్ట్రేలియాలో జీవ ప్రమాణ పరీక్షలు జరుగుతాయని, ఆ పరీక్షలు సఫలమైతేనే ఎగుమతి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ పరీక్షలు సఫలమైనట్టు తమకు సూచనప్రాయంగా తెలిసిందని కూడా ఆయన వివరించారు. మామిడి పండ్ల సీజన్లో ప్రతి ఏటా ఈ పరీక్షలు జరుగుతాయని, ప్రతిసారీ సఫలమవుతున్నామని కూడా ఆయన చెప్పారు. మొదటి విడతగా సుమారు రెండు వేల టన్నులు పంపుతున్నామని, అవి వారికి నచ్చితే ఎగుమతి పెంచుతామని ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.