ఆస్ట్రేలియాలో టి.ఆర్.ఎస్ నాయకులు నోముల నర్సయ్య

ఆస్ట్రేలియాలో టి.ఆర్.ఎస్ నాయకులు నోముల నర్సయ్య

OFTRS 3ఆస్ట్రేలియా లో టి. ఆర్. యస్ నాయకులు నోముల నర్సయ్య గారితో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ కార్యవర్గం సమావేశం !

తన వ్యక్తిగత పర్యటనలో బాగంగా ఆస్ట్రేలియా వచ్చిన టి. ఆర్.యస్ నాయకులు నోముల నర్సయ్య గారితో టి. ఆర్. యస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ – ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్(ఓఎఫ్‌టీఆర్ఎస్) కార్యవర్గ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఆస్ట్రేలియా లోని కాన్‌బేరా లో జరిగిన సమావేశంలో వివిధ నగరాలకు చెందిన టి. ఆర్. యస్ ఎన్నారై (ఓఎఫ్‌టీఆర్ఎస్) సబ్యులు మరియు తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. సీ. ఆర్ గారి రెండు సంవత్రరాల పాలన – విజయాల గురించి నోముల నర్సయ్య గారు సభ్యులకి వివరించారు.
అలాగే టి. ఆర్. యస్ పార్టీ శాఖ ప్రారంభించిన కొద్ది వారాల్లోనే ఆస్ట్రేలియా మొత్తం వ్యాపింపచేసి, ప్రతి నగరం లో ప్రత్యేక కార్యవర్గం ఏర్పాటు చేస్తూ
ఎంతో చురుకుగా పార్టీ ని ముందుకు తీసుకెళ్తున్న ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్లను, కార్యవర్గ సభ్యులని ప్రత్యేకించి అభినందించారు.

సందర్బం ఏదైన కే. సీ. ఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చుతూ, పార్టీకి అన్నివేళలా అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

చివరిగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ కార్యవర్గ సభ్యులు నర్సయ్య గారిని శాలువా తో ఘనంగా సన్మానించారు.
త్వరలో మెల్బోర్న్‌లో నర్సయ్య గారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహిస్తామని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు.

ఈ సమావేశం లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డికాసర్ల,అర్జున్ చల్లగుళ్ళ,ప్రకాష్ సూరపనేని,సాయిరాం ఉప్పు, రోహిత్ రెడ్డి,అమర్,అమర్ రావ్ చీటి,అభినయ్ కనపర్తి,రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.OFTRS 1

Send a Comment

Your email address will not be published.